రష్యా భామ మరియా షరపోవా ప్రెంచ్ ఓపెన్ ఆశలకు నిరాశ ఎదురైంది. ప్రెంచ్ ఓపెన్ ఆడేందుకు ఆమె వైల్డ్ కార్డ్ ఇవ్వడం లేదని టోర్నీ నిర్వాహకులు తేల్చిచెప్పారు. ఇంతకు ముందు నిషేదిత ఉత్ప్రేరకాలు వాడిన కేసులు ఆమెకు 15 నెలలు నిషేదానికి గురైన షరపోవా ఇటీవలనే రాకెట్ పట్టింది. దీంతో ప్రెంచ్ ఓపెన్ ఆడేందుకు కావాల్సిన పాయింట్లు లేకపోవడంతో వైల్డ్ కార్డ్ ఇస్తారని అందరూ అనుకున్నారు కానీ నిర్వాహకులు అలాంటిది లేదని తేల్చి చెప్పేసింది. ఫ్రెంచ్ ఓపెన్ ప్రధాన టోర్నీ ఈనెల 28న ప్రారంభం కానుంది.