//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు.

Category : national

పిల్లా పాపలతో ఎక్కువ సమయం గడపాల్సి రావడం, పెరిగిన పెంపకం ఖర్చులతో రెండో సంతానాన్ని కనేందుకు నగరాల్లో ఉద్యోగినులు అయిష్టత చూపుతున్నారు.పిల్లలను పెంచేందుకు శక్తి సామర్ధ్యాలను వెచ్చించే ఓపిక,సమయం కూడా ఉండటం లేదని నగర మహిళలు చెబుతున్నారు. నగర భారతంలో ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో 35 శాతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని పరిశ్రమ సంస్థ అసోచామ్‌ నిర్వహించిన అథ్యయనంలో వెల్లడైంది.అసోచామ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ చేపట్టిన ఈ సర్వేలో దాదాపు 500 మంది ఉద్యోగినులు రెండవ సంతానాన్ని కోరుకోవడం లేదని చెప్పారు. మరో మెటర్నిటీ లీవ్‌ తీసుకుని తమ ఉద్యోగాన్ని, పదోన్నతినీ పణంగా పెట్టలేమని మరికొందరు ఉద్యోగినులు తెలిపారు.

ఈ సర్వేను అహ్మదాబాద్‌, బెంగుళూర్‌, చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీ, ఇండోర్‌, జైపూర్‌, కోల్‌కతా, లక్నో, ముంబయి వంటి పది నగరాల్లో నిర్వహించారు.తమ కుమారుడు, కుమార్తెతో ఉద్యోగినులు ఎంత సమయం వెచ్చిస్తారు,రెండవ బిడ్డను కనేందుకు ఉత్సాహం చూపుతున్నారా లేదా వాటికి కారణాలపైనా సర్వేలో భాగంగా ప్రశ్నించారు.ఉద్యోగపు ఒత్తిళ్లు, ఇంట్లో పని వంటి కారణాలతో చాలా మంది తల్లులు ఒకే సంతానంతో సరిపెట్టుకోవాలని భావిస్తున్నారని సర్వే తేల్చింది.