//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గుర్మీత్ కు జైలు శిక్షలో కీలకం మన్మోహన్ అండ !

Category : national

దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నా  ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు 20ఏళ్ల జైలు శిక్ష పడడానికి పంజాబ్-హర్యానా హై కోర్ట్, సిబిఐ కోర్ట్ ల న్యాయమూర్తులు, సీబీఐ అధికారులు వత్తిడులకు లొంగకుండా వ్యవహరాయించడం కారణమని అందరికి తెలిసిందే. అయితే కీలకమైన సిబిఐ తీవ్రమైన రాజకీయ వత్తిడుల లెక్క చేయకుండా   నిర్భయంగా దర్యాప్తు కొనసాగించడానికి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కారణం అని తెలుస్తున్నది.

ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ బృందానికి నాయకత్వం వహించిన మాజీ డిఐజి నారాయణన్ ఈ విషయం చెప్పారు.  ఈ కేసులో దర్యాప్తు ముందుకు వెళ్ళడానికి వీల్లేదని అంటూ పంజాబ్, హర్యానాకు చెందిన యంపీలు వత్తిడి తెస్తూ ఉంటె ఒకరోజు సిబిఐ చీఫ్ విజయ్ శంకర్ ను ఈ కేసు గురించి చర్చించడం కోసం ప్రధాని పిలిచారు. బాధితురాళ్ళ ప్రకటనలు చూసిన మరో మాట మాట్లాడకుండా నిర్భయంగా దర్యాప్తు చేపట్టామని ఆదేశించారు.

వాస్తవానికి 2002లోనే బాధితురాలు ఆకాశరామన్న లేఖలు వ్రాసినా 2007 వరకు దర్యాప్తు అసలు ప్రారంభం కాలేదు. 2007 లో చండీగఢ్ లోని హై కోర్ట్ సీబీఐ చీఫ్ ను పిలిచి, ఎందుకు ఆలస్యమైనదని మందలించి, 57 రోజులలో దర్యాప్తు పూర్తి చేయమని ఆదేశించించింది."అప్పుడు విజయ్ శంకర్ మమ్ములను పిలిచి ఆ ఇద్దరు మహిళల ఆకాశరామన్న లేఖలు, హత్యకు గురయిన జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి, డేరా వౌలెంటీర్ రంజిత్ సింగ్ ల కేసులను మాకు అప్పచెప్పారు" అని నారాయణ గుర్తు చేసుకున్నారు.

"సాధ్విలు ఆకాశరామన్న లేఖలు వ్రాయడంతో వారెవ్వరో మాకు తెలియదు. 1999 నుండి 2002 వరకు సుమారు 200 మంది సాధ్వీలు డేరా నుండి లైంగిక వేధింపుల కారణంగా బయటకు వచ్చిన్నట్లు తెలిసింది. వారిలో 10 మందిని మాత్రమే కలవగలిగాము. అయితే అందరికి వివాహాలు కావడంతో సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదు. చివరకు 56వ రోజున ఇద్దరు బాధితులు సాక్ష్యం చెప్పడంతో  గడువుకు ఒకరోజు ముందు కోర్ట్ ముందుంచగలిగాము" అని వివరించారు.

డేరా సచ్చా సౌధా ఒక అభేద్యమైన కోట వలే ఉంది. అందులో ప్రవేశిస్తే దాడులు చేస్తామని నారాయణన్ నాయకత్వంలోని సిబిఐ బృందాన్ని గుండాలు హెచ్చరించారు. "మధ్యకాలపు చక్రవర్తి వలే అందమైన మహిళలు (సాధ్వీలు) రక్షణగా గుర్మీత్ తన ఆశ్రమంలో ఉంటున్నారు. ప్రతి రోజు రాత్రి 8 నుండి 10 గంటల మధ్య తనకు నచ్చిన సాధ్వీ ని తీసుకు రమ్మనమని సాధ్విలకు అధిపతి అయిన సాద్విని ఆదేశిస్తారు. వారిని బలవంతంగా అతని మంచం పైకి పంపేవారు.".

పైగా చేయి తిరిగిన నేరస్థుడివలె తన నేరం బయట పడకుండా జాగ్రత్త పడేవాడు. అతనికి తన గదిలో కండోమ్ లు సేకరించడం ఒక పిచ్చి. నిజంగా ఒక మృగం వలే వ్యవహరించే వాడు. డేరాలో  వాలంటీర్ అయినా రంజిత్ సింగ్ అక్కడే ఉంటున్న తన చెల్లెలుపై  గుర్మీత్ అత్యాచారానికి పాల్పడడంతో ఇద్దరు కలసి బయటకు వచ్చి సిర్సా లో నివాసం ఉంటున్నారు.

అయితే వారు వెళ్లిన కొద్దీ రోజులకే ఆకాశరామన్న ఉత్తరాలు రావడంతో అతనే వ్రాశాడనే  అనుమానంతో తన మనుష్యులతో చంపించాడు అని నారాయణన్ వివరించాడు. అతనిని చంపడానికి ఉపయోగించిన పిస్టల్ డేరా మేనేజర్ దే కావడం, నేరం జరిగిన చోట ఒక వాకి-టాకీ కూడా వదిలి వేళ్ళళడంతో ఈ కేసులో కూడా తప్పకుండా శిక్ష పడుతుందని భావిస్తున్నారు.