//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టాలీవుడ్ స్టార్‌తో మ‌ణిర‌త్నం నెక్ట్స్ ప్రాజెక్ట్‌..!

Category : movies

గ్రేట్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం చాలా కాలంగా మ‌హేష్‌బాబుతో సినిమా చేయాల‌ని ప‌ర‌య‌త్నిస్తున్నాడు. ఆ మ‌ధ్య నాగార్జున‌, మ‌హేష్‌బాబు కాంబినేష‌న్‌లో ఓ సినిమాను సెట్ చేశాడు కానీ, అది వ‌ర్క‌వుట్ కాలేదు. తాజాగా, న‌వాబ్ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో త‌న త‌దుప‌రి చిత్రాన్ని మ‌హేష్‌బాబుతో తీయాల‌నుకుంటున్నాడ‌ట‌.

తెలుగులో నాగార్జున‌తో గీతాంజ‌లి సినిమా తీశాడు మ‌ణిర‌త్నం. ఆ సినిమా వ‌చ్చి 30 ఏళ్లు కావ‌స్తుంది. అదొక్క‌టే ఆయ‌న తీసిన స్ర్టెయిట్ తెలుగు సినిమా. కానీ, మ‌ణిర‌త్నం తీసిన ప్ర‌తీ త‌మిళ సినిమా తెలుగులో డ‌బ్ అవుతూనే ఉంటుంది. అయితే, మ‌ళ్లీ ఓ తెలుగు సినిమా తీయాల‌ని గ‌త కొంత కాలంగా ప్ర‌య‌త్నిస్తున్నాడు మ‌ణిర‌త్నం.

మ‌హేష్‌బాబు, నాగార్జున కాంబినేష‌న్‌లో ఒక సినిమా ప్లాన్ చేశాడు ఆ మ‌ధ్య‌. అలాగే, రామ్‌చ‌ర‌ణ్‌తోనూ తీయాలనుకున్నాడు. కానీ, అది వ‌ర్క‌వుట్ కాలేదు. రీసెంట్‌గా న‌వాబ్ సినిమాను తీసి త‌మిళంలో భారీ విజ‌యాన్ని అందుకున్నాడు. ఇప్పుడు తెలుగులో తీయాల‌న్న‌ది ఆయ‌న ప్లాన్‌.

మ‌ణిర‌త్నం త‌న త‌దుప‌రి చిత్రం కోసం ఇప్ప‌టికే క‌థ‌ను పూర్తి చేశాడు. ఆ క‌థ‌కు మ‌హేష్‌బాబు అయితే బాగుంటాడ‌ని అనుకుంటున్నార‌ట‌. మ‌హేష్‌బాబు మెయిన్ హీరోగా. .మ‌రో యంగ్ హీరో రెండ‌వ పాత్ర‌లో ఉండేలా డిజైన్ చేశాడు. మ‌హేష్‌బాబు కూడా మ‌ణిర‌త్నంకు వీరాభిమాని. న‌వాబ్ సినిమా చూసి గొప్ప సినిమా ఇది అంటూ ట్వీట్ కూడా చేశాడు. మ‌రి మ‌హేష్‌బాబు ఇప్పుడు నిజంగానే మ‌ణిర‌త్నం సినిమాను ఒప్పుకుంటాడా..?

మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం యూర‌ప్ ట్రిప్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డి నుంచి ఆయ‌న అమెరికాకు వెళ‌తాడు. మ‌హ‌ర్షి సినిమా షూటింగ్ అమెరికాలో జ‌ర‌గ‌నుంది. ఈ వీకెండ్ నుంచి నెల‌రోజుల‌పాటు ఆ షూటింగ్‌లో పాల్గొంటాడు. అక్క‌డ నుంచి వ‌చ్చిన త‌రువాత మ‌ణిర‌త్నం సినిమా గురించి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. మ‌హేష్‌బాబు ఇప్ప‌టికే సుకుమార్ డైరెక్ష‌న్‌లో సినిమా ఒప్పుకున్నాడు.