//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హే పిల్లా.. నేను ఆ టాప్ డైరెక్ట‌ర్ పీఏని.. వ‌స్తావా నీకు అవ‌కాశం ఇప్పిస్తాను..!

Category : movies

సినీ ప‌రిశ్ర‌మ పేరు చెప్పుకొని చేస్తున్న మోసాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా తానొక టాప్ డైరెక్టర్ పీఏ అని.. తాను తలుచుకుంటే హీరోయిన్ ఛాన్స్ సులభంగా ఇప్పించగలనని చెబుతూ.. ఓ యువకుడు అమ్మాయిలకు వల విసురుతూ.. ఎంతో మంది అమ్మాయిలను ఇలాంటి మాయమాటలు చెప్పి మోసం చేసిన మణికంఠ పై.. కీర్తిపల్లి సత్యనారాయణశర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్‌ 354(ఏ), 497, 509 కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక అసలు మ్యాట‌ర్ లోకి వెళితే.. ఫిల్మ్‌న‌గ‌ర్ భగత్‌సింగ్‌ కాలనీలో నివసించే మణికంఠ సాయి (25) అనే యువకుడు ఓ అగ్ర దర్శకుడి ద‌గ్గ‌ర పీఏగా ప‌ని చేస్తున్నానని సినిమాల్లో చాన్స్‌ ఇప్పిస్తానంటూ స్థానికంగా చాలా మంది యువతులను వలలో వేసుకున్నాడని, అందినకాడికి డబ్బులు వసూలు చేశాడని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. యువతులతో శారీరకవాంఛ తీర్చుకునే క్రమంలో, వారికి తెలియకుండా వీడియోలు తీసి తనపై ఫిర్యాదు చేస్తే ఆ వీడియో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానంటూ బ్లాక్‌మెయిలింగ్ చేసేవాడ‌ని ఆయ‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమాల మీద మోజుతో మణికంఠను నమ్ముకొని వచ్చిన యువతులు సర్వం కోల్పోయారని కీర్తిప‌ల్లి వెల్లడించాడు. కాగా బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.