అగ్రరాజ్యాన్ని నాశనం చేస్తానంటూ కయ్యానికి కాలు దువ్వుతున్న ఉ.కొరియా. ఆ దేశ ఆగడాలకు అణుదాడితో అడ్డుకుంటామంటున్న అమెరికా. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న హెచ్చరికలతో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? అని ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచయుద్ధం రావడం ఖాయమని చెబుతున్నారు వేదిక్ సూత్రం ఛైర్మన్ ప్రమోద్ గౌతమ్. అది కూడా మే 13న అంటే రేపటి నుంచే మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని అంటున్నారు. చెప్పడమేగాక, యుద్ధ నివారణ కోసం శాంతిపూజలు కూడా చేపట్టారు. అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్ అధ్యక్షుడవుతారని ప్రమోద్ జోస్యం చెప్పారు. అది నిజమవడంతో ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.
‘2017 సెప్టెంబర్ వరకు అమెరికాకు ప్రతికూల పరిస్థితులు కన్పిస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అంగారక గ్రహం ప్రభావం చూపుతోంది. ఈ సమయంలో ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల అమెరికా తీవ్ర హింసను ఎదుర్కోనుంది. ఇది యుద్ధానికి దారి తీయనుంది’ అని ప్రమోద్ మీడియాతో అన్నారు. అంతేగాక, యుద్ధ నివారణ కోసం తన శిష్యులతో కలిసి ఆగ్రాలోని యమునా నదీ తీరంలో శాంతి యాగాలు చేపట్టారు. అంతేకాకుండా భారత్, పాక్ మధ్య సంబంధాలపై కూడా ప్రమోద్ జోస్యం చెప్పారు.