//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

15 ఏళ్లుగా దొరకని దొంగ..చివరికి వాషింగ్ మెషిన్లో చిక్కాడు

Category : national

ముంబయిలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది.

15 సంవ‌త్స‌రాల ముందు బీఈడీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తానని చెప్పి ముగ్గురు అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకున్న ఓ వ్యక్తి వారిని మోసం చేసి ఆ డబ్బులతో పారిపోయాడు. దీంతో సదరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై మరిన్ని కేసులు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి ఆ నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

చేసిన పాపం చెబితే పోతుందంటారు. మరి ఇతగాడు బీఈడీ అడ్మిషన్లు ఇప్పిస్తానని విద్యార్థుల్ని మోసం చేసి కోటి రూపాయలు పోగేసుకుని ఎంచక్కా ఉడాయించాడు. 15 ఏళ్లుగా పోలీసులు ఇతడి కోసం గాలిస్తున్నా దొరక్కుండా పారిపోతున్నాడు. ముంబై జూహూ ప్రాంతానికి చెందిన మనోజ్ తివారీ 2002లో విద్యార్థులను ఎరగా చేసుకుని డబ్బు సంపాదించాలనుకున్నాడు.

బీఈడీ సీట్లను ఆశగా చూపించాడు. పెద్ద మొత్తంలో వసూలు చేసి కోటి రూపాయలకు పైగా సంపాదించాడు. విద్యార్థులు జరిగిన మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్దం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం జూహూ ప్రాంతంలో ఉన్న అతడి నివాసానికి చేరుకున్నారు. మూడు గంటల పాటు ఇంట్లో అతడి కోసం వెతికారు. ఎక్కడా కనిపించలేదు.

అయితే వాషింగ్ మెషీన్ డోర్ దగ్గర కుప్పగా బట్టలు పడి ఉండడాన్ని గమనించారు. అనుమానం వచ్చి మెషీన్ డోర్ ఓపెన్ చేసి చూడగా అందులో మనోజ్ కనిపించాడు. భార్యే అతడిని అందులో దాచిందని తెలుసుకున్న పోలీసులు అవాక్కయి అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.