నవమాసాలు మోసి కని, పెంచి, ప్రేమను పంచి కంటికి రెప్పలా కాపాడుకునే తల్లి దైవంతో సమానం.అటువంటి తల్లిని మాతృదేవోభవ అంటారు.పెంచి పోషించి కృషించి పిల్లలను చెడు మార్గం నుండి ఎల్లవేళలా కాపాడుతుండే నాన్నని పితృదేవోభవ అంటారు.మరి ఇతన్ని ఏమంటారో
అమెరికాలో థామస్ బేటై అనే ఆయన పండంటి బిడ్డకు జన్మనిచ్చాడు.అందుకే ఈయనే దేశంలో మొట్టమొదటి సారిగా లింగమార్పిడి తో తల్లిగా రూపాంతరం చెంది రికార్డుకెక్కాడు.దీని వెనుక విషాదం ఉంది.తాను 12సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి కొడుకును దగ్గరికి తీసుకోవడంలేదనే బాధతో అతని తల్లి ఆత్మహత్య చేసుకుంది.
దీంతో అతను ఆమెగా రూపాంతరం చెందాలని నిర్ణయించుకున్నాడు.అంతే 1990సం.లో అతని వయసు (20) హార్మోన్ థెరఫీ, ఆపరేషన్ చేయించుకున్నాడు.ఇందుకు చట్టాలు ఒప్పుకోకపోడంతో 12సంవత్సరాలు ప్రభుత్వంతో పోట్లాడి గుర్తింపు తెచ్చుకున్నాడు.అలా అతను నుంచి ఆమెగా మారాడు.
అప్పటి నుంచి అతనికి పెళ్లి కష్టాలు మొదలయ్యాయి.తనను తనలాగే ఇష్టపడే అమ్మయిని వివాహం చేసుకోవాలని అన్వేషణ ప్రారంభించాడు.ఎట్టకేలకు 2004 నాన్సీ అనే మహిళను వివాహం చేసుకున్నాడు.అనంతరం పిల్లలకోసం ప్రయత్నాలు చేయగా సరైన కణాలు లేకపోవడంతో విరమించుకున్నారు.
పిల్లలకు కావాలంటే కణాలు కావాలి.వాటిని తన భార్య నాన్సీ నుంచి తీసుకోవాలని ప్రయత్నించిన అవి సఫలం కాలేదు.అయితే డాక్టర్ల సహకారంతో కృత్తిమ కణాల ద్వారా పిల్లలు కనే పద్దతిని అవలంభించాడు.దీంతో పండంటి బాబుకు జన్మనిచ్చాడు.
అంతేకాదు ఇతను అమెరికా వ్యాప్తంగా బాగా ఫేమస్ అయిపోయాడు.ఈయన మీద సినిమాలు, బోలెడన్ని డాక్యుమెంటరీలో తీశారు ఔత్సాహికులు.