Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమెరికాలో రైలు డీ కొట్టి తెలుగు వ్యక్తి మృతి !

Category : world

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన కృష్ణ ఎర్రవెల్లి(43).. అమెరికాలోని కాలిఫోర్నియాలో మృతి చెందారు.

సాంటా క్లారా సీఏలో డిసెంబర్ 14న లైట్ ట్రైన్ ఢీకొనడంతో ఆయన కన్నుమూశారు. ఓహియో రాష్ట్రంలోని అల్బెనీ సిటీలో నివాసముంటున్న కృష్ణ.. ఉద్యోగ రీత్యా మూడు వారాల క్రితం సాన్ జోస్‌కు వచ్చారు. అక్కడ ప్రమాదవశాత్తు రైలు ఢీకొని కన్నుమూశారు.

కృష్ణకు భార్య పూర్ణిమ, కుమార్తెలు శ్రీమయి, శ్రేష్ఠ ఉన్నారు. కృష్ణ మృతి చెందిన విషయం స్వస్థలంలోని కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కృష్ణ మృతదేహాన్ని స్వస్థలానికి పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణ అంత్యక్రియలు, ఆయన కుటుంబాన్ని భారత్‌కు పంపడానికి సాన్ జోస్‌లోని తెలుగువారు విరాళాలు సేకరిస్తు్న్నారు. సోమవారం కృష్ణ భార్య, పిల్లలను భారత్ పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Related News