//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దుమ్ము రేపుతున్న యాత్ర ట్రైలర్ .. వైఎస్ డైలాగ్స్ కు ఫిదా

Category : movies

ఓ పక్క ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా సందడి మొదలయ్యింది. ఇక సెట్స్ మీద ఉన్న వై.ఎస్ బయోపిక్ యాత్రకు సంబందించి కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టు వస్తున్న చిత్రాలు రెండూ కూడా. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాబోతున్న చిత్రాలు. అయితే ఈ చిత్రాల ఇంపాక్ట్ ప్రేక్షకుల మీద ఎలా వుంటుంది అనేది ఇరు పార్టీల్లోనూ ఆసక్తిని కలిగిస్తున్న అంశం .

ఇక యాత్ర సినిమా విషయానికి వస్తే మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న యాత్ర మూవీలో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డిగా మళయాల స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నాడు. వై.ఎస్ పాదయాత్ర నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా కూడా యాత్ర అని పెట్టారు. 70 ఎం.ఎం ఎంటర్టైన్ మెంట్స్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు ఇక వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డే సందర్భంగా యాత్ర టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో పాదయాత్రలో వై.ఎస్ రైతుల కష్టాలను గురించి తెలుసుకోవడం.. వారికి ఆయన హామీ ఇవ్వడం గురించి చూపించారు. పాదయాత్రతో ప్రజల మనసు గెలుచుకుని సిఎంగా అఖండ విజయం సాధించిన వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి సంబందించి సీన్స్ ఇందులో ఉంటాయని తెలుస్తుంది.ఫిబ్రవరి 8న ఈ సినిమా రిలీజ్ కానుంది. మమ్ముట్టితో పాటుగా థర్టీ ఇయర్స్ పృధ్వి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. వై.ఎస్ బయోపిక్ గా వస్తున్న ఈ యాత్ర వై.ఎస్ అభిమానులను మెప్పించేలా తీస్తున్నారు. మరి అది ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలంటే రిలీజ్ దాకా వెయిట్ చేయాల్సిందే.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా ‘యాత్ర’. మలయాళ నటుడు మమ్ముట్టి ఇందులో రాజశేఖరరెడ్డి పాత్రను పోషిస్తున్నారు. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్ల, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సిమాను మహి వి రాఘవ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జగపతిబాబు, సుహాసిని, రావు రమేశ్‌, అనసూయ, పోసాని కృష్ణమురళి, వినోద్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది ప్రస్తుతం యూట్యూబ్ లో దుమ్ము రేపుతుంది. ఇందులో కథానాయకుని పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోయారు. ‘నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకోగలిగాం కానీ జనాలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం.. తెలుసుకోవాలని ఉంది. వినాలని ఉంది. ఈ కడపదాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది..’ అని మమ్ముట్టి చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంది. ‘అన్నింటికన్నా అతి పెద్ద జబ్బు క్యాన్సరో, గుండెజబ్బోకాదయ్యా.. పేదరికం.. పేదరికాన్ని మించిన శిక్షేలేదయ్యా..’ అని వచ్చే‌ మాటలు హైలైట్‌గా నిలిచాయి. ఫిబ్రవరి 8న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి చూడాలి ఈ బయో పిక్ యాత్ర ఎంతగా ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటుందో మరి.

Related News