//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డార్జిలింగ్ అల్లర్లలో చైనా జోక్యం ... మమతా ఆందోళన

Category : national

"కాశ్మీర్‌లో మనం చేస్తున్న యుద్ధం శాంతిభద్రతలకు సంబంధించింది కాదు. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల వెనుక విదేశీ శక్తులు ఉన్నాయి. ఇప్పుడు చైనా కూడా మన వ్యవహారాల్లో తలదూర్చడం మొదలెట్టింది'' అంటూ కాశ్మీర్ లోయలో జరుగుతున్న అల్లర్లలో చైనా జోక్యం ఉన్నదంటూ జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రెండు రోజుల క్రితం ఆరోపించడం తెలిసిందే. 

కాగా ఇదే సమయంలో  గూర్ఖాలాండ్ కోసం జరుగుతున్న ఉద్యమంలో నెలకొన్న హింసాయుత చర్యల వెనుక కూడా చైనా ప్రమేయం ఉన్నదని  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేసారు. 

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో ఐదుసార్లు జరిపిన టెలిఫోన్ సంభాషణలలో ఆమె చైనా జోక్యం గురించి సవివరంగా చర్చించారు. గత వారం సింగ్ కు వ్రాసిన లేఖలో ఈ ప్రాంతపు వ్యూహాత్మక ప్రాధాన్యతను ఆమె గుర్తు చేశారు. `చికెన్ నెక్' గా పేర్కొనే ఈ ప్రాంతం ఒక సన్నని మార్గం ద్వారా పశ్చిమ బెంగాల్ నుండి  ఈశాన్య రాష్ట్రాలకు మిగిలిన భారతదేశంతో  భూమిని కలుపుతుంది

ప్రాంతీయ, రాజకీయ పరిష్టితుల దృష్ట్యా కూడా ఈ ప్రాంతం కీలకమైనదని హోమ్ మంత్రిత్వ శాఖ భావిస్తున్నది. భూటాన్, నేపాల్, బాంగ్లాదేశ్, సిక్కిం, డార్జీలింగ్ పర్వతాలు, ఈశాన్య రాష్ట్రాలకు మిగిలిన భారతదేశంతో భూమార్గం ఇదే కావడం గమనార్హం. ఇక్కడ ప్రస్తుతం జరుగుతన్న అల్లర్లలో చైనా ప్రమేయం ఉండే దేశ భద్రత దృష్ట్యా తీవ్ర ఆందోళనకరమైన అంశం కాగలదు. ప్రస్తుతం డార్జ్లింగ్ పర్వత ప్రాంతాలలో నెలకొన్న అల్లర్లకు విదేశాల నుండి మద్దతు లభిస్తున్నట్లు తమ వద్ద ఖచ్చితమైన సమాచారం ఉన్నదని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పార్థ ఛటర్జీ గతవారం స్పష్టం చేశారు. 

Related News