//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దూకుడు పెంచుతున్న మమత..బిజెపికి షాక్ ఇస్తారా..?

Category : national politics

దేశ రాజకీయాల్లో మమతా బెనర్జీ శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. బెంగాల్ ప్రజల్లో ఆమెకు ఉన్న మద్దతుతో గతంలో అటు కేంద్ర మంత్రిగాను ప్రస్తుతం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగాను రాణిస్తున్నారు.అయితే మోడిపై పట్టరాని కోపం, వ్యతిరేకత ఉన్న మమత ఇప్పుడు ఏం చేస్తారనేది దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే మమత ఇప్పుడు అవిశ్వాస తీర్మానంపై దూకుడు పెంచినట్టు తెలుస్తుంది.

మోడిపై మూకుమ్మడి దాడి చేసేందుకు ఆమె రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది. బిజెపిపై విపక్ష కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మంగళవారం చర్చకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ.. వైకాపా ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై చర్చ జరపని స్పీకర్ కు కాంగ్రెస్ అవిశ్వాసం ప్రకటించడంతో తప్పక చర్చకు ఆమోదించే పరిస్థితులు కనపడుతున్నాయి. అటు జాతియ, ప్రాంతీయ పార్టీలు కూడా దీనిపై ముమ్మరంగా సాధన చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలో మమతా బెనర్జీ ఢిల్లీ వెళ్ళారు. మంగళవారం ఆమె యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సహా పలు విపక్ష పార్టీల నేతలను, ఎంపీలను కలుసుకోనున్నారు. బుధవారం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఏర్పాటు చేసిన విందులోనూ పాల్గొననున్నారు. దీనితో ఆమె ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో మోడీ వ్యతిరేక కూటమిని తయారు చేసే పనిలో ఉన్న మమత ఈ సమావేశాల్లో అదే ప్రధాన అజెండాగా ముం

Related News