కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈనెల 8వ తేదీ వరకు దీక్ష చేపట్టనున్నారు. తాను చేపట్టిన సత్యాగ్రహం..CBI కి వ్యతిరేకం కాదు అని, మోదీ ప్రభుత్వ అకృత్యాలకు వ్యతిరేకంగా తాను దీక్షలో కూర్చున్నట్లు దీదీ చెప్పారు. కోల్‌కతా పోలీసు చీఫ్ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు CBI అధికారులు రావడంతో మమతా బెనర్జీ కేంద్రంపై తిరుగుబాటుకు దిగారు. ఆదివారం(ఫిబ్రవరి 3, 2019) రాత్రి నుంచి ఆమె దీక్షలో కూర్చున్నారు.
తాను చేస్తున్న దీక్ష.. రాజకీయానికి సంబంధం లేదని చెప్పారు. వేదికపై సేవ్ ఇండియా అని మాత్రమే ఉందని, తమ పార్టీ పేరు లేదన్నారు. అయితే బెంగాల్లో ఈనెల 12వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఆ పరీక్షలకు 4 రోజుల ముందు నుంచి ఎటువంటి మైక్‌లు మోగరాదు. ఆ కారణంగా దీదీ తన దీక్షను ఈనెల 8వ తేదీ వరకు చేపట్టనున్నారు.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీక్ష మూడో రోజు కొనసాగుతోంది. ఆదివారం(ఫిబ్రవరి-3,2019) శారదా చిట్ ఫండ్ స్కామ్ కి సంబంధించి ఎటువంటి వారెంట్ లేకుండా కోల్ కతా సీపీని విచారించేందుకు ఆయన నివాసంలోకి సీబీఐ అధికారుల ప్రవేశించినడానికి చేసిన ప్రయత్నంపై మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సీబీఐని మోడీ వాడుకుంటున్నారని మమత ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఆదివారం రాత్రి ఆమె కోల్ కతాలోని మెట్రో చానల్ దగ్గర నడిరోడ్డుపై ధర్నాకు దిగారు. ఆమెతో పాటు సీపీ రాజీవ్ కుమార్ కూడా ధర్నాలో పాల్గొన్నారు.
సోమవారం(ఫిబ్రవరి-4,2019) సీఎంగా తన కార్యాకలాపాలన్నింటిని ధర్నాస్థలి నుంచే మమత నిర్వహిస్తున్నారు. మమత చేస్తున్న ధర్నాకు దేశవ్యాప్తంగా పలు పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు. పలువురు నేతలు కోల్ కతా వెళ్లి మమతకు సంఘీభావం తెలిపారు.దేశంలో ఎమర్జెన్సీ కన్నా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. సీబీఐని మోడీ సర్కార్ దుర్వినియోగపరుస్తుందని, ఇది మోడీకి నష్టం చేకూరుస్తుందని ఆయన అన్నారు.
కోల్ కతాలో ఆదివారం జరిగిన ఘటన వంటివి ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగాయని అఖిలేష్ అన్నారు.ఎన్నికలు సమీపిస్తున్నందున బీజేపీ, కేంద్రప్రభుత్వం సీబీఐని తమ ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటోందని అన్నారు. కేవలం ఎస్పీ మాత్రమే ఈ విషయాన్ని చెప్పడం లేదని దేశంలోని అన్ని పార్టీలు ఇదే చెబుతున్నాయని తెలిపారు. కోల్ కతా ఘటనపై ఐపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కేంద్రం చర్య దుర్మార్గమని అన్నారు. బీజేపీని ఎదిరిస్తే.. పాత కేసులు బయటకి తీస్తున్నారని, మొన్న అఖిలేష్, నిన్న మాయావతి, ఇప్పుడు మమతా బెనర్జీపై మోడీ సర్కార్ కక్ష సాధింపులకు దిగిందని అన్నారు. ఇక నేడు సైతం మమత సీఎం గా తన విధులను రోడ్ మీద నుండే నిర్వర్తిస్తున్నారు.