//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పశువధ నిషేధం అమలుపై కేంద్రం చట్టాన్ని సవాల్ చేసిన మమతా

Category : national politics

పశువధ నిషేధం అమలునుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనెర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటువంటి చట్టం తీసుకు రావడం దేశ సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించడమే అని ఆమె మండిపడ్డారు. 

ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకం అంటూ దీనిని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని ఆమె స్పష్టం చేశారు. కేరళ, కర్ణాటక ప్రభుత్వాలు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించడం గమనార్హం. 

 "ఇప్పుడు పశు మాంసంపై నిషేధం విధించారు. రేపు చేపలు కూడా తినొద్దంటారు" అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌  ఆగ్రహం వ్యక్తం చేశారు. పశు సంపదపై నూతన చట్టం వల్ల లక్షలాదిమంది ఉపాధి కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పేదలు, దళితులు, రైతులపై దాడిగా ఆయన అభివర్ణించారు. కాగా కేంద్ర పర్యావరణశాఖ తీసుకున్న ఈ నిర్ణయానికి నిరసనగా కేరళలోని 200 కేంద్రాల్లో బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలని సీపీయం  అనుబంధ విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ నిర్ణయించింది. 

పశువధ నిషేధం చట్టం చాలా స్ఫష్టంగా ఉండగా కేంద్రం మరో చట్టం తీసుకు రావలసిన అవసరం ఏమిటని మమతా ప్రశ్నించారు. "ఈ చట్టాన్ని మేము అమలు చేయం, అసలు గుర్తించం" అని ఆమె స్పష్టం చేశారు. 

Related News