//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్థానిక సంస్థల ఎన్నికల్లో మమతా ఘన విజయం

Category : national politics

అసెంబ్లీ ఎన్నికల్లో రెండోమారు ఘనవిజయం సాధించిన తరువాత పశ్చిమ బెంగాల్ లో గత ఆదివారం ఏడు పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికలలో ముఖ్యమంత్రి మమతా బనెర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘాన విజయాలు సాధించింది. ఏడింటిలో ముడు పురపాలక సంఘాలను గెలుచుకున్నారు. 

గూర్ఖా హిల్స్ లో నాలుగు పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికలలో మూడింటిలో బిజెపి మిత్రపక్షం గోర్ఖ జనముక్తి మోర్చా (జిజెయం) మూడు గెలుచుకోగా, మొదటిసారిగా ఈ ప్రాంతంలో టియంసి ఒక చోట విజయం సాధించింది. 

 రాయ్‌గంజ్ మున్సిపాలిటీలోని 27 వార్డులకు గాను టీఎంసీ 22 వార్డులు గెలుచుకుంది. ప్రతిపక్ష జీజేఎం 3 వార్డుల్లో గెలుపొందింది. కాంగ్రెస్, బీజేపీ చెరో వార్డు గెలుచుకున్నాయి. 

మిరిక్ మున్సిపాలిటీలో టీఎంసీ 9 వార్డలకు గాను ఆరు వార్డులు దక్కించుకుంది., గోర్ఖా ముఖ్తి మోర్చా మూడు వార్డ్ లను కైవసం చేసుకుంది. 

పుజలిలో టీఎంసీ 12 వార్డులు గెలుచుకోగా, బిజెపి 2, కాంగ్రెస్ 1 చోట గెలిచాయి. 

కాగా, కుర్సెయాంగ్ మున్సిపాలిటీలో జీజేఎం 16 వార్డులు కైవసం చేసుకోగా, టీఎంసీ 4 వార్డులు మాత్రమే గెలుచుకుంది. డార్జిలింగ్‌ మున్సిపాలిటీలో జీజేఎం  32 వార్డులకు గాను  31 వార్డులు గెలుచుకోగా, టీఎంసీ ఒక్క వార్డుతోనే సరిపెట్టుకుంది. డోంకల్ లో 21 వార్డులకు గాను టీఎంసీ 18 వార్డులు గెలుచుకుంది.

Related News