//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విసుగొచ్చి 106 మందిని చంపిన మేల్ నర్స్

Category : world

వైద్యం చేయడంలో చేసి చేసి విసుగెత్తిపోయిన జర్మన్ నర్సు వందమందికిపైగా రోగులను పొట్టనబెట్టుకున్న ఘటనపై న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.

జర్మనీలోని డెల్మెన్‌ హోస్ట్‌ ఆసుపత్రిలో నీల్స్ హోగెల్ (41) అనే వ్యక్తి మేల్ నర్సుగా పని చేస్తున్నాడు. అతను 2015లో ఓ ఇద్దరు రోగులపై హత్యాయత్నానికి పాల్పడి, మరో ఇద్దర్ని హతమార్చిందన్న కేసులో అరెస్టు అయ్యాడు. దీంతో ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు షాక్ తిన్నారు. ఆ మేల్ నర్స్ మొత్తం 106 మందిని చంపినట్టు గుర్తించారు. తొలుత ఆమె 90 మందిని హతమార్చినట్టు గుర్తించారు.

దీంతో న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు ఖరారు చేసింది. దీంతో మరికొందరు బాధితులు ఈ కేసు మరోసారి దర్యాప్తు చేయాలని కోరారు. దీంతో దీనిని మరోసారి దర్యాప్తు చేసిన పోలీసులు..ఈసారి అతను మరో 16 మందిని హతమార్చినట్టు గుర్తించారు. దీంతో అతను మొత్తం 106 మందిని హతమార్చాడని నిర్ధారించారు. ఈ హత్యలన్నీ 1999 నుంచి 2005 మధ్యకాలంలో చేసినట్టు తెలిపారు.

2005లో ఒక రోగికి ప్రాణాంతక మందు ఇంజెక్ట్ చేస్తుండగా చూసిన మరో నర్సు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతను అరెస్టు అయ్యాడు. వైద్యం అంటే విసుగు చెంది వారందర్నీ చంపేసినట్టు అతను పోలీసులకి తెలిపాడు.