//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Category : politics

పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీ రెండోరోజు సమావేశం హోటల్ దస్‌పల్లాలో ఉదయం 10గంటలకు ప్రారంభంకానుంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఏర్పడ్డ జేఎఫ్‌సీ సమావేశం నిన్న కూడా జరిగింది. కాగా నేడు జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా వ్యక్తిగత పనుల కారణంగా లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ రెండో రోజు సమావేశాలకు హాజరు కావటం లేదు. అలాగే మరికొద్దిసేపట్లో జరిగే సమావేశానికి కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య అధ్యక్షత వహించనున్నారు.