//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

Category : national

మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్టు మొదలైంది.

ఎన్డీయేతో తెగతెంపులు చేసుకునే దిశగా శివసేన మరో అడుగు వేసింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని సంచలన ప్రకటన చేసింది. ముంబైలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎన్డీయే నుంచి తప్పుకోవాలని శివసేన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో 2019 పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడంపై ఎంపీ సంజయ్ రౌత్ తీర్మానం ప్రవేశ పెట్టారు. సభ్యులందరి సమ్మతితో దీన్ని ఆమోదించారు. అనంతరం ఎన్డీయేతో పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతామని సంజయ్ రౌత్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ప్రభుత్వం నడుస్తోంది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా ప్రస్తుతం బీజేపీకి 122. శివసేనకు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సభలో మ్యాజిక్ ఫిగర్ 145 కావడంతో రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన శివసేన ఇప్పుడు ప్రభుత్వం నుంచి తప్పుకుంటే ఫడ్నవీస్ సర్కార్ చిక్కుల్లో పడే ప్రమాదం కనిపిస్తోంది.