Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

క్లాస్, మాస్ లుక్ లో నాగ చైతన్య ‘మజిలీ’ టీజర్‌

Category : movies

పెళ్లి తరువాత చై-సామ్ హీరో,హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం మజిలీ.కొన్ని గంటల క్రితమే ఈ సినిమా టీజర్ రిలీజ్ కావడం జరిగింది.అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మజిలీ’ టీజర్‌ రానే వచ్చింది .

నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ సినిమాను నిర్మిస్తోంది. ఈరోజు ప్రేమికుల రోజును పురస్కరించుకుని చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ‘నీకో సంవత్సరం టైం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు సచినే అవుతావో సోంబేరే అవుతావో నీ ఇష్టం’ అంటూ రావు రమేశ్‌ చెప్పే డైలాగ్‌తో, నాగచైతన్య క్రికెట్‌ ఆడుతున్న సన్నివేశంతో టీజర్‌ మొదలైంది.

సినిమాలో నాగచైతన్య, దివ్యాంశ కౌశిక్‌ ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత నాగచైతన్యకు సమంతతో పెళ్లి జరుగుతుంది. కానీ మొదట ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేక చైతూ సమంతను దూరం పెడతాడు. అంతలా ఆమె పై ద్వేషం పెంచుకుంటాడు చై . ‘నువ్వు నా రూంలోకి రాగలవేమో కానీ నా జీవితంలోకి రాలేవు’ అంటూ కోపంతో నాగచైతన్య సమంతతో అంటాడు. వెధవలకెప్పుడూ మంచి పెళ్లాలు దొరుకుతారని నువ్వే ప్రూవ్ చేశావ్' అనే పోసాని డైలాగ్ మనసుకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇందులో చైతూ క్లాస్ లుక్ తోను .. మాస్ లుక్ తోను కనిపిస్తున్నాడు. ఆయన ప్రియురాలిగా దివ్యాంశ .. భార్యగా సమంత కనిపిస్తున్నారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ .. సినిమాపై ఆసక్తిని పెంచేదిలా వుంది.గోపీ సుందర్ ‌అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. ఏప్రిల్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News