Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'మజిలీ' మూవీ రివ్యూ ....!

Category : movies

అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లి తరువాత జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'మజిలీ'. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో సినిమా టాక్ బయటకి వచ్చేసింది.అమెరికాలో దాదాపు 150కి పైగా లొకేషన్లలో ముందస్తు గా విడుదలైన ఈ సినిమాపై ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాస్ వస్తోంది. సమంత, చైతులు తమ పాత్రల్లో జీవించేశారని.. ఎమోషనల్ గా సాగిన కథను బాగా డీల్ చేశారని ట్వీట్లు పెడుతున్నారు. లవర్ బాయ్ గా,భర్త గా నాగ చైతన్య నటన తన కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫామెన్స్ గా చెబుతున్నారు.అలాగే ఈ సినిమాలో సమంత పోషించిన పాత్ర కు మంచి మార్కులే పడుతున్నాయి.ఓ మధ్య తరగతి ఇల్లాలి పాత్రలో ఆమె కనబరిచిన నటన ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గర చేస్తుందట.ముఖ్యముగా నాగ చైతన్య,సమంత మధ్య సీన్స్ పిచ్చ పీక్స్ అని టాక్.

ఒక రకంగా చెప్పాలంటే ఏం మాయ చేసావే తరువాత ఆ స్థాయి సూపర్ హిట్. ఈ సినిమా తో వీరిద్దరూ అందుకోనున్నట్టు సినిమా చూసిన వారి అభిప్రాయం.అలాగే ఈ సినిమా లో నటించిన రావు రమేష్,పోసాని క్యారెక్టర్స్ కి కూడా మంచి స్పందనే వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా స్పెషల్ షో చూసిన అక్కినేని నాగార్జునతో పాటు మరికొందరు సినిమాపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు.ఈ సినిమా చూసిన అనంతరం నాగార్జున ఓ ట్వీట్ కూడా చేసారు.అందులో .. ''మజిలీ'' చిత్రంలో సమంత, నాగచైతన్యలు బ్రిలియంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. వాళ్లను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రావు రమేశ్, పోసాని కృష్ణమురలి నటన అధ్బుతం'' అంటూ నాగార్జున ట్వీట్ లో పేర్కొన్నారు