Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యు/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకున్న 'మజిలీ’ ....ఈ సారి హిట్ ఖాయం అంటున్న అభిమానులు.

Category : movies

అక్కినేని దంపతులు నాగచైతన్య, సమంత హీరో ,హీరోయిన్లు గా పెళ్లి తరువాత కలిసి నటిస్తున్న మొదటి సినిమా 'మజిలీ'.ఈ సినిమాలో సమంత తో పాటు మరో హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్ కూడా నటిస్తుంది .ప్రధానంగా ‘మజిలీ’ సినిమా క్రికెట్, ప్రేమ, పెళ్లి నేపథ్యంలో సాగే ఓ విభిన్నమైన కధాంశం.అలాగే ఈ సినిమాలో రొమాన్స్, ఎమోషనల్ అన్ని కలగలిపి పోసిన ఫ్యామిలీ డ్రామా గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించాడు.ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగచైతన్య, సమంత వివాహం తరువాత తొలిసారి కలిసి నటించిన చిత్రం కావడంతో ‘మజిలీ’పై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అయితే, ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా సినిమా ఉంటుందని టాక్.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వగా. సెన్సార్ టాక్ ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ పిచ్చ పీక్స్ అని చెబుతున్నారు. క్లైమాక్స్ లో సమంత,నాగ చైతన్య మధ్య ఉండే ఎమోషన్ సీన్స్.ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట. ఈ సినిమాలో నాగచైతన్య, సమంత నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందేనని అంతా అంటున్నారు. ముఖ్యంగా భార్య పాత్రలో సమంత నటన థియేటర్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని కదిలిస్తుందట. భర్త కోసమే తాపత్రయ పడే భార్యగా సమంత అద్భుత నటన కనబరిచారట. ఇక 19 ఏళ్ల లవర్ బాయ్ లా , 34 ఏళ్ల ఫ్యామిలీ మ్యాన్ గా నాగచైతన్య నటన తన కెరీర్‌లోనే ది బెస్ట్ అని అంటున్నారు. క్లైమాక్స్ సినిమాకు ప్రధాన బలమని. క్లైమాక్స్ చూసిన తరవాత ప్రతి ఒక్కరూ థియేటర్ నుంచి బరువెక్కిన గుండెలతో బయటికి వస్తారని టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఈ సినిమా తోనైనా నాగచైతన్య సూపర్ హిట్ అందుకుంటాడా లేదా అని.