ప్రపంచ క్రికెట్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన బాల్ ట్యాంపరింగ్ వివాదంలో అసలు సూత్రధారి ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ అని తెలుస్తుంది. ముందుగా అతను ఒక ఆలోచనకు వచ్చి.. ఆ విషయాన్నీ బ్యాన్క్రఫ్ట్ కి చెప్పి ఆ తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ అనుమతి తీసుకుని ఈ పని చేసాడనే ఆరోపణ వినపడుతుంది. జట్టులోని సీనియర్ ఆటగాళ్ళు ఎవరికి దీనిపై ఎలాంటి సమాచారం లేదని..కానీ స్మిత్ మాత్రం అందరు అనుకునే ఈ పని చేసామని..చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.
దీనితో ఒక్కసారిగా కీలక ఆటగాళ్ళు అందరు వార్నర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు తమకు సంబంధం లేని ఈ విషయంలో తమను ఎందుకు ఇరికించారనే ప్రశ్న వార్నర్ కి , స్మిత్ కి ఎదురైందని ఆస్ట్రేలియా మీడియా కథనాలు ప్రసారం చేసింది. ఈ క్రమంలోనే అతనితో కలిసి ఆడేది లేదని కూడా వారు క్రికెట్ ఆస్ట్రేలియా ముందు స్పష్టం చేసారట. అయితే ఇప్పటికే ఉప సారధి బాధ్యతల నుంచి తప్పుకున్న వార్నర్.. ని జట్టు నుంచి కూడా తప్పించాలనే డిమాండ్ వినపడుతుంది.
ఆసీస్ జట్టులో తీవ్ర విభేదాలు పొడచూపాయని... డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా వార్నర్‌కు ఫాస్ట్ బౌలర్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది. టీమ్ బస చేసిన హోటల్లో సోమవారం రాత్రి వార్నర్ తన క్రికెటేతర స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకోవడం కూడా ఇతర ఆటగాళ్ళకు ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తుంది. జట్టులో ఈ పరిస్థితి ఉంటె అతను ఆ విధంగా ఎందుకు ప్రవర్తించాడు అంటూ ఆటగాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసారట.