//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టిన సూపర్ స్టార్ మహేష్...!

Category : movies

భరత్ అను నేను భారీ విజయం తరువాత మహేష్ బాబు తన 25 సినిమా షూటింగ్ ఈ రోజు స్టార్ట్ చేసాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ వంశీపైడిపల్లి దర్శకత్వ భాద్యతలను నిర్వహించనున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఈ రోజు లాంఛనంగా డెహ్రాడూన్ లో ప్రారంభమైంది. ఈ షెడ్యుల్ లో సినిమాలో వచ్చే కొన్ని ప్రముఖ మైన సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. ఈ మూవీ లో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుంది.

ఈ సినిమాలో హీరో మహేశ్ బాబు ఎంబీఏ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారు.