//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహేష్ సెన్సాఫ్ హ్యూమర్ కి స్టార్స్ ఫిదా ...పూర్తిగా తెలుసుకుంటే మీకు అలానే అనిపిస్తుంది .....!

Category : movies

మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్. రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ హీరో అనతి కాలంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరో గా ఎదిగాడు. నేడు మహేష్ బాబు జన్మదినం.ఈ రోజుతో మహేష్ బాబు 43వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

తెలుగు సినిమా పరిశ్రమలో కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు... మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకటేష్ లాంటి పెద్ద స్టార్లు సైతం మహేష్ ని అమితంగా ఇష్టపడతారు. ఒక మంచి వ్యక్తిత్వం, మంచి మనసున్న స్టార్‌గా ఆయన ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.

గతంలో పలు సందర్భాల్లో టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు ఆయనంటే తమకు ఎంత ఇష్టమో చెప్పిన కొన్ని గ్రేట్ వర్డ్స్ గురించి ఓ సారి మనం గుర్తు చేసుకుందాం.

మెగాస్టార్ : మా ఇంట్లో మహేష్ బాబును అంతా బాగా లైక్ చేస్తాం. మహేష్ సినిమాలు వరుసగా చూస్తుంటాం. 'భరత్ అనే నేను' సినిమాను రిలీజైన రోజే చూశాం. మహేష్ కు ఫోన్ చేసి సినిమా చాలా బావుందని చెప్పాను.

నాగార్జున : ఊరిపి సినిమా సమయంలో... మహేష్ బాబు నాకు ఫోన్ చేసి 20 నిమిషాలు మాట్లాడారు. వాట్ ఈజ్ దిస్ నాగ్.. ఫెంటాస్టిక్ అన్నాడు. ఇంకొన్ని మాటలు తెలుగులో ఓపెన్ గా చెప్పాడు. అవి మీ ముందు చెప్పలేను. మహేష్ ఏ విషయమైనా చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. 'ఇక మేమేం చూపించాలి అన్నాడు'... ఆయన ఏ మన్నాడో మీరే అర్థం చేసుకోండి అంటూ నాగ్ వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ : టాలీవుడ్ లో మహేష్ మరియు ఎన్టీఆర్ లు బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిన విషయమే. మహేష్ భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ... మీరందరూ ఆయన్ను ప్రిన్స్ అంటారు. సూపర్ స్టార్ అంటారు. నేను ఆయన్ను మహేష్ అన్న అంటాను. ఈ రోజు మహేష్ అన్న ఆడియో ఫంక్షన్‌కు నన్ను ముఖ్య అతిథి అంటున్నారు. నేనే ముఖ్య అతిథిగా రాలేదు. నేనొక కుటుంబ సభ్యుడిగా వచ్చాను అని చెప్పి మహేష్ అంటే తనకి ఎంత ఇష్టమో చెప్పాడు.

రామ్ చరణ్ : టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రాంచరణ్, ఎన్టీఆర్ , మహేష్ బాబు ముగ్గురుకూడా మంచి ఫ్రెండ్స్. ముగ్గురుఒకేచోట కలిస్తే అక్కడ పండుగ వాతావరణం ఉంటుందని ఎన్నో సార్లు వారి నోటి నుండే విన్నాము. ఒకానొక సందర్భంలో రాంచరణ్ మాట్లాడుతూ అందరూ మహేష్ బాబును అందగాడు అంటారు. ఆయనకున్న అందం కాస్త మాకు కూడా ఉంటే బావుంటుంది అనిపిస్తుంది.

సమంత : మహేష్ బాబు గురించి అందరికీ తెలియని విషయం... ఆయనకు సెన్సాఫ్ హ్యూమర్ 100 రెట్లు ఉంటుంది. అది ఎవరికీ కనిపించదు. ఆయనకు చాలా దగ్గరయితే ఆయన మన వద్ద ఆ సైడ్ ఓపెన్ చేస్తారు.

పూరి జగన్నాథ్ : మహేష్‌ ఒక అడిక్షన్. మహేష్‌తో పని చేయడం మత్తు లాంటిది. అనుక్షణం డైరెక్టర్‌కు కిక్ ఇచ్చే యాక్టర్ మహేష్. మనం ఒకటి అనుకుంటే దానికి పదింతలు చేస్తారు. ప్రతి రోజూ ఇంటికెళ్లి హ్యాపీగా నిద్రపోవచ్చు. అంతగా సంతృప్తినిస్తాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ : నేను, మహేష్ బాబు ఎక్కువగా మాట్లాడుకునేది ఏమిటంటే.. మీనింగ్‌ఫుల్‌గా ఉంటూ మనం కమర్షియల్‌ సక్సెస్ ఎందుకు సాధించలేం. ఇప్పుడున్న ట్రెండులో మీనింగ్ ఫుల్ సినిమాలు చేసే స్టార్లు అతి కొద్ది మంది ఉన్న టైమ్‌లో మీనింగ్ ఫుల్ సినిమా బాగా అర్థం చేసుకుని చేసే స్టార్ మహేష్ బాబు.