సూపర్‌స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మహేష్ 25వ చిత్రానికి కౌంట్‌డౌన్ అంటూ కొన్ని లెటర్స్ విడుదల చేయడం, ఆ లెటర్స్ అన్ని కలిపితే ‘రిషి’ అని పేరు రావడంతో.. చిత్ర టైటిల్ అదే అనుకున్నారంతా. కానీ రిషి జర్నీ అంటూ తాజాగా మహేష్ 25వ సినిమాకు సంబంధించిన టైటిల్ ‘మహర్షి’గా ప్రకటిస్తూ పస్ట్ లుక్ పోస్టర్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
అలాగే మహర్షి ఫస్ట్ లుక్ ట్రీజర్ ని కూడా రిలీజ్ చేసారు. బర్త్ డే సందర్భంగా మహేష్ అభిమానులకి బహుమతిగా ఫస్ట్ లుక్ తో పాటుగా ఫస్ట్ లుక్ ట్రీజర్ కూడా రిలీజ్ చేసారు. ఈ ట్రీజర్ లో మహేష్ బాబు హ్యాండ్సామ్ లుక్ తో కనిపిస్తున్నాడు.