//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

25వ సినిమాలో మహర్షిగా కనువిందు చేయనున్న మహేష్...!

Category : movies

అభిమానులు ఎంతో కాలం నుండి వేచిచూస్తున్న సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు 25వ సినిమా ఫస్ట్‌లుక్ బయటకువచ్చింది. ప్రిన్స్ పుట్టినరోజు బహుమతిగా చిత్రం బృందం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'మహర్షి'గా టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో మహేష్ బాబు రిషిగా ఓ కొత్త లుక్‌లో కనిపించనున్నారు అని తెలుస్తుంది. మహేశ్ జోడిగా పూజా హెగ్డే నటిస్తుండగా, హీరో అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా.. కేయూ మోహనన్‌ ఫొటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా సూపర్‌స్టార్‌ 25వ చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్‌లుక్‌కు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తోంది. డెహ్రాడూన్‌, హైదరాబాద్‌, గోవాలలో షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్ర నిర్మాణ పనులు ఏకధాటిగా జరుగుతున్నాయి. 2019 ఏప్రిల్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు.