Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ "టైటిల్ రెడ్డి గారి అబ్బాయి"....!

Category : movies

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మహర్షి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే . మహర్షి చిత్రానికి కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మహేష్ బాబు కున్న స్టార్ డంతో మంచి వసూళ్ల నే సాధించాడు. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ స్టార్ హీరో....ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ లో మహేష్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఎన్నో కధలు విన్న మహేష్.పటాసు, సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్- 2 వంటి వరుస సూపర్ హిట్స్ కి దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయనున్నాడు మహేష్ , అయితే ఈ చిత్రానికి ” రెడ్డి గారి అబ్బాయి ” అనే టైటిల్ ని పెట్ట బోతునట్లు సమాచారం.

అంతే కాకుండా ఈ సినిమాకు మరో టైటిల్ గా " సరిలేరు నీకెవ్వరూ ” అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే అనిల్ రావిపూడి సినిమా అంటేనే పుల్ లెంగ్త్ వినోదాత్మకంగా ఉంటుంది. కాబట్టి పైగా రాయలసీమ నేపథ్యం కాబట్టి ” రెడ్డి గారి అబ్బాయి ” అనే టైటిల్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకు మహేష్ తన ప్రతి సినిమా టైటిల్ కూడా ఎంతో పవర్ ఫుల్ గా ఆ స్టోరీ లోని హీరో ఇజాన్ని ఏలివెట్ చేసేలా ఉంటుంది.కానీ అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమా టైటిల్ మాత్రం. కాస్త సాఫ్టు గా కామెడీ గా ఉండడం. మహేష్ అభిమానులను ఒక్కింత ఆశ్చర్యానికి , ఆందోళనకు గురిచేస్తోంది.చూడాలి మరి చిత్ర యూనిట్ ఇదే టైటిల్ ఫైనల్ చేస్తోందా లేదా ఇంకో టైటిల్ ఏమైనా ఫిక్స్ చేస్తోందా అన్నది.

Related News