//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మీరు మ‌రెన్నో విజ‌యాలు అందుకోవాలి :మ‌హేష్ బాబు

Category : movies

క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సామాజిక అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ సినిమాల‌ను తీయ‌డంలో కొర‌టాల శివ దిట్ట అనే చెప్పుకోవాలి. అందుకు ఆయ‌న తెర‌కెక్కించిన మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్ చిత్రాలే నిద‌ర్శ‌నం. ఇటీవ‌ల విడుద‌లైన భ‌ర‌త్ అనే నేను సినిమాతో ఆ విష‌యాన్ని మ‌రోసారి నిరూపించారు. మ‌హేష్‌బాబు సినీ కెరియ‌ర్‌లో మైలు రాయిగా నిలిచిపోయే చిత్రాన్ని అందించిన కొర‌టాల శివ పుట్టిన రోజు సంద‌ర్భంగా మ‌హేష్‌బాబు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ మ‌రోసారి భ‌ర‌త్ అనే నేను జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు.

నా ప్రియ‌మైన మిత్రుడు, అద్భుత‌మైన ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. మీరు జీవితాంతం సంతోషంగా ఉంటూ మ‌రెన్నో విజ‌యాలు అందుకోవాల‌ని కోరుకుంటున్నాను. మీపై ఆ గౌర‌వం ఎప్ప‌టికీ ఇలానే ఉంటుంది. ఈ సంద‌ర్బంగా భ‌ర‌త్ అనే నేను చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ప్రేక్ష‌కులు మెచ్చిన ప్రెస్ మీట్ స‌న్నివేశాన్ని గుర్తు చేసుకుంటున్నాను. మీ అద్భుత‌మైన ద‌ర్శ‌క శైలి, ర‌చ‌న‌లే నాలోని ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ను బ‌య‌ట‌కు తెచ్చాయి. అంటూ త‌న సోష‌ల్ మీడియాలో మ‌హేష్ బాబు పోస్టు చేశాడు.