//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యూఎస్ కంపెనీ కి సీఈఓ గా మహేష్ ...!

Category : movies

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా , వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం మ‌హ‌ర్షి. దిల్‌రాజు, అశ్విని దత్‌, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. దేవి శ్రీ ప్ర‌సాద్ స్వరాలు స‌మకూరుస్తున్నారు.

ఈ సినిమాలో మహేష్ తల్లిగా అలనాటి అందాల నటి జయసుధ‌నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య 2019 ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ‘మహర్షి’. చిత్రంలో మహేష్ విద్యార్థిగా, యూఎస్ కంపెనీ సీఈవోగా రిషీ పాత్ర‌లో కనిపించనున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం హైద‌రాబాద్‌లోని ఓ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది .

త్వ‌ర‌లో ఈ చిత్రం మ‌రో షెడ్యూల్ కోసం యూఎస్ వెళ్ళ‌నుంది. దాదాపు 25 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండ‌నుండ‌గా, అక్క‌డికి మ‌హేష్ త‌న ఫ్యామిలీతో క‌లిసి వెళ్ల‌నున్నాడు అని సమాచారం యూఎస్ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అక్టోబ‌ర్ మొద‌టి వారంలో ఈ షెడ్యూల్ మొద‌లు కాబోతుంది