Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహేష్ బాబు కి సొంత ధియేటర్ ఉన్నా ....ఆ ధియేటర్ అంటేనే ఎంతో ఇష్టమట.....?

Category : movies

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 25వ సినిమా ‘మహర్షి’.ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్‌ను మరింత జోరు పెంచింది. ఇప్పటికే ఈ సినిమా 110 కోట్ల గ్రాస్..80 కోట్ల షేర్ రాబట్టిన సంగతి తెలిసిందే . ఇకఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో హీరో మహేష్ బాబు.. ‘మహర్షి’ చిత్ర యూనిట్‌తో కలిసి నిన్న సాయంత్రం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌లో అభిమానులతో కలిసి సందడి చేసారు. దీంతో తమ అభిమాన హీరోని చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ధియేటర్ కి పోటెత్తారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ...సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌తో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్‌లో సూపర్ హిట్టైయిన చాలా చిత్రాలు ఈ ధియేటర్ లో ప్రదర్శించబడ్డాయని ఈ సందర్భం గా ఆయన గుర్తు చేసుకున్నారు.

ముఖ్యంగా తన తొలి బ్లాక్ బస్టర్ సినిమా ‘మురారి’ సినిమాను ఈ థియేటర్‌లోనే తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి చూసానని చెప్పుకొచ్చిన మహేష్ .ఆ సినిమా చూసిన తర్వాత నాన్నగారు తనను భుజం తట్టి ప్రశంసించడాన్ని ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. అందుకే తనకు AMB సినిమా మల్టీప్లెక్స్ థియేటర్ ఉన్నా..సుదర్శన్ 35 MM థియేటర్‌నే సొంత సినిమా హాల్‌గా భావిస్తానని ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. చివర్లో మహేష్ బాబు మరోసారి మీ కోసం కాలర్ ఎగరేస్తున్నా అంటూ కాలర్ ఎగరేసి మరి బయటకు వెళ్లారు. ఇక సుదర్శన్ 35 MM థియేటర్‌ విషయానికొస్తే..మహేష్ బాబు నటించిన మురారి,ఒక్కడు,అతడు,పోకిరి,దూకుడు,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బిజినెస్ మేన్ వంటి పలు చిత్రాలు ఈ థియేటర్‌లోనే మంచి విజయాలు అందుకున్నాయి.అంతే కాకుండా ఆర్టీసి క్రాస్ రోడ్ లో ప్రధర్షితమైన మహేష్ సినిమాల్లో దాదాపు 8 సినిమాలు ఇక్కడ కోటి కి పైగా వసూళ్లు ఒక్కో సినిమా వసూళ్లు సాధించిన జాబితాలో ఉన్నాయి.ఈ లిస్ట్ లో ఇప్పటికీ మహేష్ బాబే టాప్ లో ఉన్నాడు. తాజాగా మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రం ఈ థియేటర్‌లోనే విజయవంతంగా ప్రదర్శితమవుతుంది.

Related News