Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తనని తాను చూసుకుని .... మురిసి పోయిన ప్రిన్స్ మహేష్ బాబు...!

Category : movies

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సౌత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇప్పటికే మహేష్ తాను నటించిన ప్రతి సినిమాలో తనదైన నటనతో ఎన్నో రికార్డు లు కోళ్ల గొట్టిన సంగతి తెలిసిందే.అంతటి స్టార్ హీరో తాజాగా మరో రికార్డు ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇండియాలో అతి కొద్దీ మంది బాలీవుడ్ సెలెబ్రేటిస్ కి మాత్రమే దక్కిన ఒక ఘనతను తాజాగా మహేష్ తన ఖాతాలో వేసుకున్నాడు.అదేమిటి అంటే ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్ మ్యూజియం గురించి అంత వినే ఉంటారు. అయితే రీసెంట్ గా మేడమ్ టుస్సాడ్ మ్యూజియం కి సంబంధించిన నిర్వాహకులు మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని తయారు చేసేందుకు ముందుకు వచ్చారు. అచ్చం మహేశ్ ను పోలిన మైనపు విగ్రహాన్ని తయారు చేయడమే కాకుండా దాన్ని మన హైదరాబాద్ కి కూడా తీసుకొచ్చారు. అయితే మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని కొంతసేపటి క్రితమే హైదరాబాదులోని ఏఎంబీ సినిమాస్ లో మేడమ్ టుస్సాడ్స్ గ్రూప్ సభ్యులతో కలిసి మహేష్ బాబు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి మహేశ్ తో పాటు ఆయన సతీమణి నమ్రత,కుమారుడు గౌతమ్,కూతురు సితార రావడం జరిగింది.వీరితో పాటు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనపు విగ్రహంతో కలసి మహేశ్ కుటుంబసభ్యులు సెల్పీలు , ఫొటోలు దిగడం జరిగింది. ఈ సాయంత్రం 6 గంటల వరకు విగ్రహాన్ని అభిమానుల సందర్శనార్థం ఏఎంబీ సినిమాస్ మాల్ లో ఉంచనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలిస్తారు.ఇప్పటి వరకు ఇలాంటి ఘనత సొంత చేసుకున్న వారి జాబితాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్,షారుక్ ఖాన్,కాజోల్,ఐశ్వర్య రాయ్,అనుష్క శర్మ వంటి వారు ఉన్నారు.తాజాగా ఆ లిస్ట్ టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ కి చోటు దక్కడం విశేషం.