Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ తో మహేష్ బాబు నెక్స్ట్ మూవీ....?

Category : movies

ప్రస్తుతానికైతే టాలీవుడ్ లో చిన్న పెద్ద దర్శకులు అనే భేదం అయితే లేదనే అనుకోవాలి.ఎందుకంటే ఒకప్పుడు చిన్న హీరోలు సైతం పెద్ద దర్శకుల సినిమాల్లో నటించేస్తుందుకు ఆసక్తి చూపించే వారు. కానీ ప్రస్తుతం అలా లేదు స్టోరీ చెప్పింది చెప్పినట్టు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తే చాలు ఎంతటి స్టార్ హీరోలు అయినా ఇట్టే కొత్త దర్శకులకు సినిమా ఒకే చేస్తున్నారు.

ఈ కోవలోకే ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు తరుణ్ భాస్కర్. తాజాగా ఈ దర్శకుడితో కలిసి పనిచేసేందుకు సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సైతం ఇంట్రస్ట్‌ చూపిస్తున్నాడు. ఇప్పటికే అర్జున్‌ రెడ్డి ఫేం సందీప్‌ రెడ్డి వంగాతో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పిన మహేష్.

పెళ్లి చూపులు సినిమాతో ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్‌ తరువాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో మరో సక్సెస్‌ సాధించాడు. త్వరలో హీరోగానూ ఎంట్రీ కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్న ఈ యువ దర్శకుడు, సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుకు ఒక లైన్ స్టోరీ ని వినిపించాడట. ఈ లైన్ పట్ల సుముఖంగా ఉన్న మహేష్ పూర్తి స్క్రిప్ట్‌తో రావాలని సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై మహేష్, తరుణ్‌ భాస్కర్‌ నుంచి ఎలాంటి ముఖ్య సమాచారం అయితే ఇంకా రాలేదు.ప్రస్తుతానికైతే మహేష్ తన 25 సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.అంతే కాకుండా ఈ సినిమాలో అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తుండగా.. పూజా హేగ్డే హీరోయిన్‌గా నటిస్తుండడం విశేషం.

Related News