//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సుకుమార్ కి ఫిదా అయిన మహేష్..త్వరలోనే...!

Category : movies

రంగస్థలం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమాను సుకుమార్ తెరకెక్కించిన ఎందరినో ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా రాంచరణ్ సమంతా సహా సినిమాలోని ప్రతి పాత్రకు ఆయన తీసుకున్న జాగ్రత్త గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

అసలు క్రియేటివ్ దర్శకుడు అంటే కమర్షియల్ విలువలతో సినిమాను తీస్తాడు అనుకున్న వారికి ఈ సినిమా షాక్ ఇచ్చింది. ఈ సినిమా చుసిన అంత సేపు కూడా..తెలుగు సినిమా మారిపోయింది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది... దీనితో స్టార్ హీరోలు ఇప్పుడు సుకుమార్ బాట పడుతున్నారు.

తాజాగా ఆ జాబితాలో మహేష్ బాబు చేరిపోయినట్టు తెలుస్తుంది. సుకుమార్ తో మహేష్ 1 నేనొక్కడినే అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ అయినా విమర్శకుల ప్రశంశలు కూడా అందుకుంది. అయితే త్వరలోనే మహేష్ బాబు సుకుమార్ తో మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.

మహేష్ బాబు ప్రస్తుతం భరత్ అను నేను సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత వంశీ పైడపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.త్వరలో ఈ సినిమా షూటింగ్ కి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.