Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహేష్ బాబు థియేటర్ రేట్స్ చూస్తే ఎవరైనా అబ్బా అనాల్సిందే .....!

Category : movies

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎఎంబీ సినిమాస్ పేరిట మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే . హైదరాబాద్ కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్స్ పక్కన నిర్మించిన ఈ మల్టిప్లెక్స్ ను ఆయన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ ప్రారంభించారు. ప్రస్తుతం ఎక్కడ చుసిన ఈ మల్టిప్లెక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. మొత్తం ఈ థియేటర్ లో ఏడు స్క్రీన్ లు ఉండగా , అందులో ఆరు స్క్రీన్ లను రెగ్యులర్ గా సినిమాలు ప్రదర్శించగా, ఒక స్క్రీన్ లో మాత్రం ప్రత్యేక షో లు మాత్రమే ప్రదర్శిస్తారని తెలుస్తుంది .

ఇక ఈ థియేటర్ లో టిక్కెట్టు ధర వివరాలు బయటకొచ్చి సామాన్యులకు వణుకు పుట్టిస్తున్నాయి. మాములుగా సిటీస్ లోని మల్టీ ప్లెక్సు ల్లో 150 టిక్కెట్టు ఎగ్జిక్యూటివ్ రిక్లెయినర్ చైర్ కి రూ.250 టిక్కెట్టు మాత్రమే ఉంటే.. ఏఎంబీ సినిమాస్ లో కనిష్టంగా రూ.200 నుంచి గరిష్టంగా రూ.440 వరకూ టిక్కెట్టు ధరలు ఉన్నట్లు తెలుస్తోంది. రూ.200- రూ.230, రూ.300-రూ.440 రేంజు లో నిర్ణయించారట.

అయితే ఇంత భారీ బాదుడును సామాన్యుడు అయితే తట్టుకోలేరని అంత మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ లో ఈ ధరలకు జీవో లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.150 ధరకు మాత్రమే టిక్కెట్టు అమ్మాలి. రిక్లయినర్లకు 250ఓకే. అదే గరిష్ఠ టిక్కెట్టు ధర. అంతకుమించి టికెట్ ధర పెంచితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. చూడాలి మరి దీనిపై ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉంటుందో .. ప్రస్తుతం మాత్రం మహేష్ థియేటర్ ను చూసేందుకు జనాలు పోటీ పడుతున్నారు.

Related News