//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముద్దులరెడ్డి సరసన మహేష్ హీరోయిన్ .....

Category : movies

టాలీవుడ్ లో సందీప్ వంగా దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి కలక్షన్ల రికార్డులను తిరగరాసింది. విజయ్ దేవరకొండ నటించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల ప్రజలకి మాత్రమే కాదు, పొరుగురాష్ట్రాల సినీ అభిమానులకు సైతం బాగా నచ్చింది. విజయ్ దేవరకొండ పోషించిన అర్జున్ రెడ్డి పాత్రలో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి కనబరిచారు. ఈ సినిమా తో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది .Mahesh babu heroine act with Arjun reddy

తమిళంలో విక్రమ్ తనయుడు అర్జున్ రెడ్డి గా నటిస్తుండగా.. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి అవతారం ఎత్తబోతున్నారు. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కి కూడా సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు సుతారియాను ఎంపిక చేసుకున్నారు. షాహిద్ కపూర్ పక్కన ఛాన్స్ అనగానే వెంటనే ఒప్పుకుంది. తీరా తన రోల్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత షాక్ తినింది. లిప్ లాక్స్ చూసి బయపడిపోయి తప్పుకుంది. Mahesh babu heroine act with Arjun reddy

తాజాగా ఈ రోల్ కి మహేష్ బాబు హీరోయిన్ కైరా అద్వానీ ఎంపికైంది అని సమాచారం . వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించిన ఈ బ్యూటీ లిప్ కిస్ లకు ఓకే చెప్పింది. షాలిని పాండే కి ఈ రోల్ మంచి క్రేజ్ ని తీసుకొచ్చింది. కైరా కెరీర్ కి ఈ రోల్ బాగా ఉపయోగపడుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఏడాది జూన్ 21వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. Mahesh babu heroine act with Arjun reddy