Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాంచరణ్ ని ఫాలో అవుతున్న మహేష్

Category : movies

మహేశ్ బాబు తన 25వ సినిమాగా 'మహర్షి' చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్, కొంతకాలంగా యూఎస్ లో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టీమ్ అక్కడి నుంచి హైదరాబాద్ కి తిరిగిరానుంది.తదుపరి షెడ్యూల్ ను ఇక్కడే చిత్రీకరించనున్నారు. Mahesh babu Follow Ram Charan

గ్రామీణ నేపథ్యంలో మహేశ్ బాబు .. పూజా హెగ్డే .. అల్లరి నరేశ్ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అందుకోసం రంగస్థలం లాంటి భారీగా విలేజ్ సెట్ ను సిద్ధం చేస్తున్నారు. నిజంగా విలేజ్ లోనే షూట్ చేశారు అనిపించేలా ఈ సెట్ ను తీర్చిదిద్దుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. మహేశ్ అభిమానులంతా ఈ సినిమా కోసమే వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.భారత్ అనే నేను చిత్రం తరువాత చేస్తున్న మహర్షి మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.Mahesh babu Follow Ram Charan