Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాలర్ ఎగరేసి మరి చెప్పిన ప్రిన్స్...." మహర్షి " బ్లాక్ బస్టర్ అందరి అమ్మలకి అంకితం....!

Category : movies

అభిమానులంతా గర్వంగా కాలర్‌ ఎత్తుకునే సినిమా తీశామని ఇది వరకే చెప్పాను. ఆ మాట నిజమైంది. ఇప్పుడు నేను కూడా కాలర్‌ ఎత్తుకుంటున్నా’’ అన్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మహర్షి’. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. అశ్వనీదత్‌, దిల్‌రాజు, పీవీపీ నిర్మాతలు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ సినిమా సక్సెస్ మీట్ నీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ తన కెరీర్లో పాతిక సినిమాలు చేయడం వెనుక అసలు కారణం ఆయన అభిమానులు ఇచ్చిన సపోర్ట్ హే అని ఆయన స్పష్టం చేశారు.ముఖ్యంగా మహర్షి సినిమా తన జీవితంలో మర్చిపోలేని సినిమా అని. మూడు సంవత్సరాల క్రితం ఈ కథ విని దిల్ రాజు గారు క్లాసికల్ సినిమా అని తర్వాత ఈ కథ విన్న మరో నిర్మాత అశ్వినీ దత్ గేమ్ చేంజర్ సినిమా అని చెప్పడం..ఈ రెండు కామెంట్లు నాకు సినిమా చేయడానికి మంచి బూస్ట్ ఇచ్చాయి...

‘‘నాకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ చూడ్డానికి ముంబై వెళ్లాను. చివరి బంతికి ధోని సిక్స్‌ కొట్టినప్పుడు ఎంత సంతోషించానో ఈ సినిమా చూసి దిల్‌రాజు ‘సిక్సర్‌ కొట్టాం’ అన్నప్పుడు అంతగా ఆనందించాను. సాధార‌ణంగా ద‌త్తుగారు ప్రిన్స్‌ .. బాబు అని పిలుస్తుంటారు. విప‌రీతంగా న‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే మ‌హేష్ అని పిలుస్తారు. అలా ఎప్పుడు పిలుస్తారా....? అని నేను ఎదురుచూస్తుంటాను. ఈ సినిమా చూసిన త‌ర్వాత ఆయ‌న అలా పిలవడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందనీ ఆయన చెప్పడం జరిగింది.నా 25 సినిమాల ప్రయాణం చాలా ప్రత్యేకం. ‘మహర్షి’ మరింత ప్రత్యేకం. అమ్మ దగ్గరకు వెళ్లినప్పుడల్లా కాఫీ తాగుతుంటాను. అలా తాగితే దేవుడి గుళ్లో ప్రసాదం తిన్నట్టుగా ఉంటుంది. ‘మహర్షి’ విజయాన్ని అమ్మలందరికీ అంకితం ఇస్తున్నా. కథలో భాగంగా మంచి పాటల్ని అందించారు దేవిశ్రీ. ఇలాంటి పాటలు ఆయన మాత్రమే అందించగలరు. నరేష్‌ ఈ పాత్ర చేస్తారా, లేదా....? అనిపించింది. కథ వినగానే ఆయన ఒప్పుకున్నారు. తొలి వారంలోనే నా గత చిత్రాల రికార్డుల్ని ‘మహర్షి’ దాటుకుని వెళ్లబోతోంది. అంతకంటే ఆనందం ఇంకేం లేద’’న్నారు.