నిన్న ఆదివారం జరిగిన BWF వరల్డ్ టూర్ ఫైనల్స్లో బంగారు పతకం సాధించిన పీవీ సింధు. జపాన్ స్టార్ షట్లర్ నవొమి ఒకుహర తో ఆడిన మ్యాచ్ లో 21-19, 21-17 తేడాతో వరుస సెట్లలో పీవీ సింధు ఘానవిజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకుంది.
టైటిల్ విన్నర్ గా ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. ఈ ఘనతను అందుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
దీని పై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ.... ఎంత అద్భుతమైన ఘనత! బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ను గెలిచిన పీవీ సింధుకి అభినందనలు. నిన్ను చూసి యావత్తు దేశం గర్వపడుతోంది. నువ్వు మరిన్ని ఉన్నత స్థానాలను అందుకోవాలి’ అని మహేష్ బాబు ట్వీటాడారు.