//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మ‌హేష్ బాబు 26 వ చిత్రానికి డైరెక్టర్ ఫిక్స్...

Category : movies

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మ‌హ‌ర్షి. శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. "భరత్ అనే నేను" చిత్రం తరువాత వస్తున్నా ఈ చిత్రంపై ఇటు మహేష్ బాబు అంటూ ఫాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మ‌హ‌ర్షి మూవీ షూటింగ్ జరుగుతుండగానే తన త‌ర్వాత మూవీ కోసం ద‌ర్శ‌కుడు సుకుమార్ కు గ్రీన్ సిగ్న‌లు ఇచ్చాడు మహేష్ బాబు. రంగ‌స్థ‌లం చిత్రం హిట్ సుకుమార్ మంచి జోష్ మీద ఉన్నాడు. ఆ సినిమా తరువాత చేయ‌నున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ఆసక్తి కలుగుతుది. గ‌తంలో సుకుమార్, మ‌హేష్ క్యాంబినేష‌న్ లో వ‌చ్చిన 1 నేనొ క్క‌డినే డిజాస్ట‌ర్ అయింది..

మహేష్ త‌న 26 వ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా సుకుమార్ ని ఎంపిక చేసుకున్నాడు. అయితే ఈ సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్వాతంత్ర్య ఉద్య‌మ నేప‌థ్యంతో ఉండబోతోందనే టాక్ వినిపిస్తుంది. తనకు భారీ డిజాస్ట‌ర్ ఇచ్చిన సుకుమార్ పై ఎంత నమ్మకం లేకపోతే ఈ చిత్రం చేయడానికి మహేష్ ఒప్పుకున్నాడో అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.