అనిల్ కుంబ్లే రాజీనామాతో ఖాళీ అయినా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం శ్రీలంక మాజీ ఆటగాడు మహేళ జయవర్దనే దరఖాస్తు చేసినట్లు సమాచారం. ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేయడంతో బీసీసీఐ రెండోసారి దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తుల స్వీకరణకు జులై 9 చివరి తేదీగా నిర్ణయించారు. మే లో మొదటిసారి దరఖాస్తులు కోరగా టామ్ మూడీ, లాల్‌చంద్ రాజ్‌పుత్, దొడ్డ గణేశ్, వీరేంద్ర సెహ్వాగ్ లు దరఖాస్తులు పంపారు. తొలుత సెహ్వాగ్, టామ్ మూడీ మధ్య పోటీ ఉందని భావించిన ...ఇప్పుడు జయవర్దనే దరఖాస్తు చేయడంతో పరిస్థితి మారిపోయింది. జయవర్ధనే ఐపీఎల్-10వ సీజన్ టైటిల్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టుకి ప్రధాన కోచ్‌గా బాధ్యతలందించాడు. గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్ సలహా మండలి ఎవరిని కోచ్ గా నియమిస్తోందో చూడాలి. జులైలో భారత జట్టు శ్రీలంక పర్యటనకు ముందే భారత జట్టుకి ప్రధాన కోచ్‌ను ఎంపిక చేస్తామని బీసీసీఐ ప్రతినిధులు ఇదివరకే వెల్లడించారు.