//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహర్షి టీజర్ రివ్యూ....!

Category : movies

మహేష్ బాబు హీరో గా , వంశీపైడిపల్లి దర్శకత్వం లో రానున్న చిత్రం మహర్షి. మహేష్ బాబు పుటిన రోజు కానుకగా కాసేపటి క్రితం విడుదలైన మహర్షి ట్రీజర్ సోషల్ మీడియా లో దుమ్ము రేపుతోంది.

ముఖ్యంగా మహేష్ ఏ సినిమాలో లేని విధంగా ఆఫ్ హ్యాండ్ షర్ట్ తో కాలేజీ కుర్రాడిలాగా చాల అందంగా కనిపిస్తున్నాడు. ట్రీజర్ లో మహేష్ బాబు వాకింగ్ స్టైల్ కి ఫాన్స్ తో పాటుగా యావత్ సినీ అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ఆలా మహేష్ బాబు నడుస్తూ వస్తుంటే కాలేజీ లో ఉండే అందరూ అమ్మాయిలు మహేష్ నే చూస్తున్నట్టు చూపించించారు.

సాధారణంగా చేతిలో బుక్స్ తో కనిపించటం అందరికి అలవాటు కానీ , ఇందులో మహేష్ బాబు చేతిలో లాప్టాప్ పట్టుకొని నడుస్తూ వస్తుంటే చూసే అభిమానులకి కనులవిందుల అనిపిస్తుంది. ట్రీజర్ లోనే ఇంతలా అందరిని కట్టిపడేసిన మహేష్ బాబు సినిమాతో ఎన్ని రికార్డ్స్ ని బద్దలు కొడతాడో అని ఎప్పటి నుండే చర్చించుకుంటున్నారు. ఈ సినిమా వేసవి కానుకగా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 న రానున్నది.