Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహేష్ బాబు " మహర్షి" డే 2 కలెక్షన్స్ ...మూవీ బ్లాక్ బస్టర్ హిట్స్..!

Category : movies

సూపర్‌స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ గురువారం(మే 9) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. మిక్స్ రివ్యూస్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా తొలిరోజు నుంచే బాక్సాఫీసును షేక్ చేసింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముగ్గురు స్టార్ ప్రొడ్యూసర్లు సంయుక్తంగా నిర్మించడం విశేషం. మహేష్ కెరియర్‌లో ఒక చిత్రానికి ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమాస్ బ్యానర్లపై దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్‌లు ఈ సినిమాను అత్యంత భారీ హంగులతో నిర్మించారు.

ఇక కలెక్షన్ల విషయానికొస్తే.. తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘మహర్షి’ 34 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏకంగా 61కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు 34 కోట్ల పైగా షేర్ రాబట్టిన మహర్షి రెండో రోజు ఆ దూకుడు కొనసాగిస్తున్నాడు. ఇక ఈ సినిమా వసూళ్ల హంగామా చూస్తే మహేష్ కెరియర్ లో ది బెస్ట్ మూవీ అయ్యేలా ఉంది. మహేష్ మహర్షి రెండవ రోజు కూడా కలక్షన్స్ జోరు కొనసాగించాడు. రెండో రోజు ఏపీ, తెలంగాణాలో 15 కోట్ల పైగా షేర్ తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా రెండు రోజుల్లో 70 కోట్ల దాకా గ్రాస్.. 45 కోట్ల షేర్ రాబట్టాడు మహర్షి. చూస్తుంటే మహేష్ బాబు నాన్ బాహుబలి రికార్డులను సైతం కొల్లగొట్టేలా ఉన్నాడు.

ఇటీవల కాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే బడ్జెట్ వంద కోట్లు అలవోకగా దాటేస్తోంది. ‘మహర్షి’ సినిమాకు 135 కోట్ల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఏపీ, నైజాం, ఓవర్సీస్ అన్నీ కలుపుకుని 95 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. వీటితో పాటు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్ మరో 50 కోట్ల బిజినెస్ సాధించడంతో నిర్మాతలు సినిమా విడుదలకు ముందే సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు.ఇక కృష్ణా డిస్ట్రిక్ట్ లో రెండో రోజు మహేష్ మహర్షి 74 లక్షల కలక్షన్స్ సాధించింది. ఈ లెక్కన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డ్ సాధించిన రంగస్థలం...... సినిమా కూడా అక్కడ రెండవ రోజు 69 లక్షలు మాత్రమే రాబట్టింది. ఈ లెక్కన మహర్షి కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. గురువారం ఎలాగు అన్నిచోట్ల హౌజ్ ఫుల్ కాగా శుక్రవారం కూడా ఆక్యుపెన్సీ బాగుందని తెలుస్తుంది.శని, ఆదివారాలు ఎలాగు వీకెండ్ కాబట్టి ఇక తిరుగు ఉండదు. మొత్తంగా మహర్షి కలక్షన్ల సునామి మొదలైంది. రిలీజ్ ముందు ఎంత కాన్ ఫిడెంట్ గా చెప్పారో రిలీజ్ తర్వాత వస్తున్న వసూళ్లను చూసి చిత్రయూనిట్ మరింత జోష్ ఫుల్ గా ఉంది. శుక్రవారం చిత్ర దర్శక నిర్మాతలు సక్సెస్ కేక్ కట్ చేసి ప్రెస్ తో మాట్లాడారు. దిల్ రాజు ఆఫీస్ దగ్గర బాంబులను కూడా కాల్చారు.

Related News