//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహారాష్ట్ర సీఎం జంటగా నటించిన అయన భార్య.. ఆట, పాటతో వినూత్న సందేశం..!

Category : national

ముంబై చుట్టూ ఉన్న నదుల సంరక్షణ, వాటి పవిత్రతను ప్రజలకు అవగాహన తెలిపేందుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అయన భార్య అమృతా ఫడ్నవీస్ ఓ వినూత్న ప్రయోగం చేశారు. ఈ దంపతులు ప్రత్యేకంగా ఓ వీడియో సాంగ్‌ను రూపొందించారు. నదుల సంరక్షణ వాటి గొప్పదనం గురించి ప్రజల్లో ఎలా చైతన్యం తీసుకురావాలి అనే అంశం పై ఈ వీడియో సాంగ్ ను చిత్రీకరించారు. ఇందులో సీఎం అయన భార్య నటించడం విశేషం.ఇప్పుడు ఆ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ సాంగ్‌ను తప్పుపడుతున్నాయి.

ముంబై చుట్టూ మొత్తం నాలుగు నదులు ఉన్నాయి. పొయ్‌సర్, దహిసర్, ఓషివారా, మితి నదులు ముంబై ప్రాంతంలో ప్రవహిస్తాయి. ఆ నదుల నీటిని కాపాడుకోవాలంటూ ఆ సాంగ్‌లో సీఎం ఫడ్నవీస్, ఆయన భార్య అమృత వేడుకుంటారు. అయితే ఆ పాటలో వాళ్లు ఇద్దరూ నటించారు. సీఎం దంపతులు సాంగ్‌లో నటించడం షాకింగ్‌గా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ సీరియస్ అయ్యింది. దీనిపై మహారాష్ట్ర సీఎం కార్యాలయం స్పందించింది. ఇదో సామాజిక అంశమని, సాంగ్‌ను ప్రైవేటుగా రూపొందించామని, ప్రభుత్వానికి చెందిన ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని సీఎం కార్యాలయం చెప్పింది. ఇదే ఆ సాంగ్ వీడియో. టీసిరీస్ ఈ సాంగ్‌ను రిలీజ్ చేసింది.