//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దిగొచ్చిన 'మహా' సర్కార్ !

Category : national

సమస్యలపై కదం తొక్కిన మహారాష్ట్ర రైతాంగానికి మహారాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది.

వేలాది మండి రైతులు వందలాది కిలోమీటర్లు నడచి ముంబయి ఆజాద్ మైదానికి వచ్చిన రైతులు సమస్యల పరిష్కారం కోసం గళమెత్తారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని డిమాండ్లకు తలొగ్గి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్నీ మహారాష్ట్ర రైతులు సాధించిన గొప్ప విజయంగా చెప్పవచ్చు. అటవీ భూముల సాగు హక్కుతోపాటు పలు డిమాండ్లు రైతులు సాధించుకోవడం గమనార్హం.

నాసిక్ నుంచి 180 కిలోమీటర్లు రేయింబవళ్లూ ఆరు రోజులపాటు నడిచి రైతుల ఆజాద్ మైదానానికి తరలివచ్చారు. 35 వేల మందితో మొదలయిన ర్యాలీ ... ఇప్పుడు దీనిలో పాల్గొంటున్న వారి సంఖ్య 50 వేలకు చేరుకుంది. ఈ విషయం కేవలం మహారాష్ట్ర లోనే కాక దేశవ్యాప్తంగా సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. అందరు రైతుల పక్షాన నిలబడేందుకు సిద్దమయ్యారు. దీంతో ఆలోచన పడిన మహా ప్రభుత్వం రైతుల వత్తిడికి దిగొచ్చి అన్ని డిమాండ్లు ఆమోదిస్తున్నట్టు ప్రకటించింది.

ముంబయిలోని ఆజాద్ మైదానంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించిన మహారాష్ట్ర రెవిన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ రైతుల అన్ని డిమాండ్లూ ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే విధాన భవన్ వద్ద ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ ‘రైతుల డిమాండ్లు ఆమోదిస్తున్నాం. వ్యవసాయ భూములు గిరిజనులకు అప్పగించడానికి సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం. 2005కి ముందు నుంచి భూములు సాగుచేసుకుంటున్నట్టు ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు రైతుల డిమాండ్లన్నీ మా ప్రభుత్వం ఆమోదిస్తోంది’ అని ప్రకటించారు.

అన్నదాతలకు కడుపు నింపిన డబ్బావాలాలు

తమ డిమాండ్లు సాధించుకోడానికి మహానగరానికి తరలివచ్చిన వేలాది మంది రైతన్నలను ముంబయి వాసులు, డబ్బావాలాలు ఆదుకున్నారు. రైతుల దాహార్తిని తీర్చడంతోపాటు ఆహారం అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. నాసిక్ నుంచి 180 కిలోమీటర్ల నడిచి ఆజాద్ మైదానానికి రైతులు చేరుకున్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన రైతుల కడుపునింపడం తమ కనీస బాధ్యతగా భావించామని ముంబయి డబ్బావాలా అసోసియేషన్ అధికార ప్రతినిధి సుభాష్ తలేకర్ ప్రకటించారు.

పదో తరగతి పరీక్షలు జరుగుతున్నందున పగలు నడిస్తే.. విద్యార్థులకు అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో రైతులు రాత్రి పూట నడిచి గమ్యాన్ని చేరుకుంది. వేరే వాళ్లు ఇబ్బంది పడకుండా.. రాత్రి పూట నడుస్తూ గమ్యాన్ని చేరుకోవడం ఎంతో అరుదైన విషయం. అలా చేయడం అన్ని ఇబ్బందులు ఎదుర్కొనే రైతులకే సాధ్యం ఏమో ?

బైలోని బైకుల్లా జంక్షన్ వద్దకు చేరుకోగానే కొంత మంది ముంబై వాసులు వారికి మంచినీళ్లు, ఖర్జూరాలు, బిస్కెట్లు అందించారు. రైతులు పాదాలకు చెప్పులు లేకుండా నడవడం చూసి చలించిపోయిన కొందరు.. వారికి పాదరక్షలు సమకూర్చారు. అలాగే ఆదివారం రాత్రే ఆజాద్ మైదాన్‌కు తరలివచ్చిన రైతులకు ముంబయి నగరవాసులు వడ-పావ్, మంచినీళ్లు, ఆహారం అందించారు.