//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

Category : politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబుతో పాటు 14మందిపై కేసు నమోదైంది. ఎనిమిది ఏళ్లుగా ఒక్క నోటీసు కూడా లేకుండా ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

తిరుమల శ్రీవారి సేవలో వుండగానే నోటీసులు వచ్చినట్లు చంద్రబాబు తెలుసుకున్నారు. కేసును కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. మరోవైపు కేసుపై సీఎం చంద్రబాబు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒకే సారి ఏపీ సీఎం చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ నోటీసులు జారీ చేయడాన్ని తెలుగు దేశం నేతలు తప్పు బడుతున్నారు. చంద్రబాబుపై నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ఏపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కనున్నాయి.

విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, 144సెక్షన్ ను అదుపులో ఉన్నా పట్టించుకోకపోవడం, వంటి వివిధ కారణలతో చంద్రబాబుపై కేసు నమోదయ్యాయి. ఎనిమిది నెలల క్రితం చంద్రబాబుకు మహారాష్ట్రలోని ఓ న్యాయస్థానం కోర్టుకు హాజరుకాకపోవడంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచీ ఈ వారెంట్ పెండింగ్‌లో ఉంది. ఇటీవల మహారాష్ట్ర వాసి ఒకరు ఈ నాన్ బెయిల్‌బుల్ వారెంట్‌ను ఎందుకు అమలు చేయడంలేదంటూ పిటీషన్ వేశారు.

Tags: #MaharashtraCourt #ArrestWarrantAgainstChandrababuNaidu