మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు మరోసారి ప్రమాదం తప్పింది. దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. వీళ్లిద్దరూ మీరా రోడ్డులో ఓ కార్యక్రమానికి వెళ్లేందుకు హెలికాప్టర్లో బయలుదేరారు.
అయితే ల్యాండింగ్ కోసం ఓ స్కూల్లో ఏర్పాట్లు చేశారు. అక్కడికి చేరుకున్న హెలికాప్టర్ స్కూలు ఆవరణంలో దింపేందుకు పైలట్ ప్రయత్నం చేశారు. అయితే అక్కడ వైర్ ఉండటంతో హెలికాప్టర్‌ను వెనుకకు మళ్లించాడు. మరో చోట సురక్షితంగా ల్యాండ్ చేశారు. పైలట్ సమయస్పూర్తితో ఫడ్నవీస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.
ఇలాగే గతంలోనూ ఫడ్నవీస్ ఓ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మే 2017లో ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లాతూర్‌లో క్రాష్ ల్యాండింగ్ అయింది. అదే నెలలో మరోచోట సాంకేతిక కారణాలతో హెలికాప్టర్ టేకాఫ్ తీసుకోవడంలో ఫెయిల్ అయింది. .