//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేసీఆర్-అమిత్ షాల మధ్య `మాటల యుద్ధం'తో బోసి పోయిన మహానాడు

Category : state sports

అనూహ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలంగాణ లో పర్యటిస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ప్రసంగాలపై విరుచుకు పడటం, ఆ తరువాత కొద్దీ సేపటికి హైదరాబాద్ నగరంలో జరిగిన బిజెపి సభలో తన మాటలకు కట్టుబడి ఉన్నానని అంటూ అమిత్ షా స్పష్టం చేయడంతో ఒకేసారి తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కింది. 

ఈ సమయంలో తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాకరంగా హైదరాబాద్ లో జరుపుకున్న తెలంగాణ పార్టీ తొలి మహానాడు వెలవెల పోయిన్నట్లయింది. తెలంగాణ కు లక్ష కోట్ల రూపాయల నిధులు నరేంద్ర మోడీ ప్రభుత్వం గత ముడేళ్ళల్లో ఇచ్చిన్నట్లు  అమిత్ షా చెప్పడం కేసీఆర్ ఆగ్రహానికి కారణమైనది. 

కేసీఆర్ పత్రిక సమావేశం జరుగుతున్న సమయంలోనే తెలంగాణ మహానాడులో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రసంగం ప్రారంభం ఐనా కూడా టివి చానెల్స్ ఏవీ పట్టించుకోలేదు. కేసీఆర్ విలేఖరుల సమావేశం ముగిసిన తరువాతనే చంద్రబాబునాయుడు ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించాయి. 

చంద్రబాబునాయుడు ఏ కార్యక్రమం చేసిన ముందుగా మీడియా దృష్టి ని ఆకర్షించడం కోసం ప్లాన్ చేస్తారు. అయితే మీడియా దృష్టి అంతా కేసీఆర్, అమిత్ షా లపైకి పోవడంతో ఆయనను ఎవ్వరూ పట్టించుకోలేదు. 

పైగా చంద్రబాబునాయుడు ప్రసంగం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సహితం నిరుత్సాహం కల్గించింది. ఉదయం నుండి పార్టీ నాయకులు కేసీఆర్ పాలనపై నిప్పులు చెరుగుతూ, కేసీఆర్ ను గద్దె దించడం కోసం ఎవ్వరు కలసి వస్తే వారితో కలసి వెడతాం అన్న సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చారు. తెలంగాణలో ఉన్నది రాబందుల ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి ద్వజమెత్తారు.

కాగా,   చంద్రబాబు నాయుడు కేసీఆర్ పాలనపై ఒక్క మాటకూడా ప్రస్తావించ లేదు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధికి చేసిన పనులను ప్రస్తావించడానికే పరిమితం అయ్యారు. టిడిపి కి పార్టీ కార్యకర్తలే ప్రాణం అంటూ చెప్పుకు వచ్చారు. తెలంగాణ లో తిరిగి కోలుకొంటామని అన్నా మళ్ళి అధికారం చేపడతాం అని మాత్రం అనలేక పోయారు. 

Related News