//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కూటమి కలకలం ...ఆ నాయకుల రహస్య భేటీ టీడీపీ కొంప ముంచుతుందా

Category : politics

క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకొనే తెలుగుదేశం పార్టీలో చిచ్చు రగులుకుంది. మహాకూటమి పేరుతో పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ పంచన చేరినప్పటికీ తమకు దక్కింది శూన్యమని పలువురు నేతలు వాపోతున్నారు. టికెట్ కేటాయించని వారు రెబల్స్ గా బరిలోకి దిగుతున్నారు. పొత్తులో కేటాయించిన సీట్లు సరిగ్గా లేవని,అభ్యర్థుల ఎంపిక కూడా పారదర్శకంగా లేదని పలువురు టీడీపీ నాయకులు,కార్యకర్తలు గత రెండ్రోజులుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేంద్రంగా ఆందోళనలు చేస్తున్నారు. దీనికితోడుగా తమ ఆందోళనను బహిరంగంగా వ్యక్తం చేయలేని నేతలు భవిష్యత్ కార్యాచరణ పై సమావేశం నిర్వహించినట్లు సమాచారం.Mahakutami : TDP huge loss for mahakutami leaders secret meet

నివురుగప్పిన నిప్పులా ఉన్నారు తెలుగు తమ్ముళ్ళు. .టీడీపీ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా బంజారాహిల్స్ న్యూ ఎమ్మెల్యే కాలనీలోని ఒక నాయకుడి ఇంట్లో హైదరాబాద్ నగర టీడీపీ నేతలు రహస్యంగా భేటీ అయ్యారని సమాచారం. ఈ సమావేశంలో ముషీరాబాద్ టికెట్ ఆశిస్తున్న ఎంఎన్ శ్రీనివాసరావు, ఖైరతాబాద్ టికెట్ ఆశిస్తున్న లంకల దీపక్ రెడ్డిలతోపాటు అలీ మస్కతి, జీవీఆర్ నాయుడు, బద్రినాథ్ యాదవ్, ప్రదీప్ చౌదరి తదితరులు పాల్గొన్నారని తెలిసింది. చివరిక్షణంలోనైనా టికెట్ వస్తుందన్న ఆశతో ఉన్న కూన వెంకటేశ్ గౌడ్, బీఎన్ రెడ్డి ఈ సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తుంది. Mahakutami : TDP huge loss for mahakutami leaders secret meet

సీట్ల కేటాయింపులో నగర నేతలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ కోసం కష్టపడితే తమకు దక్కిందేమిటని వారు వాపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా టీడీపీకి కేటాయించలేదని - సీనియర్ నేతలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన నాయకులు ఈ విషయంపై చంద్రబాబును కలిసి తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారని చెప్తున్నారు.Mahakutami : TDP huge loss for mahakutami leaders secret meet

మరోవైపు తమ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా పార్టీ సీనియర్లకే తెలుగుదేశం పార్టీ షాకిచ్చిందని ప్రచారం జరుగుతోంది. కూకట్ పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరు ఖరారయింది. విశాఖ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును సుహాసిని కలిశారు. అనంతరం ఆమె పేరును ప్రకటించారు. కాగా కూకట్ పల్లి టికెట్ తనకే వస్తుందని నమ్మకంతో పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి ఈ నియోజకవర్గంలో ఇది వరకే ప్రచారం కూడా మొదలుపెట్టడం గమనార్హం. పార్టీ నిర్ణయంతో పెద్దిరెడ్డి తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.Mahakutami : TDP huge loss for mahakutami leaders secret meet

Related News