//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీత‌క్క పోటీ చేసే సీటు ఫిక్స్ చేసిన మ‌హాకూట‌మి..! పోటీ చేస్తుందా..? రాజీనామా చేస్తుందా..?

Category : politics

ఓరుగ‌ల్లు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన నేత సీత‌క్క. 2009లో ములుగు నియోజ‌క‌వ‌ర్గం ఉంచి గెలిచిన సీత‌క్క‌క‌కు ఇప్పుడు సీటు స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌లో చేఇర‌న ఆమెకు ఇప్పుడు ఎక్క‌డ్నుంచి పోటీ చేస్తార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ములుగు సీటు నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోదెం వీర‌య్య రెండుసార్లు గెలిచారు. ఆదివాసీల‌లో వీర‌య్య‌కు మంచి ప‌ట్టుంది. సీత‌క్క కూడా ఇదే సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత కావ‌డంతో ఇప్పుడు సీటు స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది.

అయితే, వీర‌య్య మ‌రోసారి పోటీకి రెడీ అవుతున్నాడు. దీంతో సీత‌క్క‌ను సీటు మారాల‌ని కాంగ్రెస్ నేత‌లు సూచిస్తున్నార‌ట‌. 2014 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా చందూలాల్‌కు 58325 ఓట్లు వ‌స్తే, పోదెం వీర‌య్య‌కు 49526 ఓట్లు, సీతక్క‌కు 39441 ఓట్లు ప‌డ్డాయి. గ‌త ఎన్నిక‌ల్లో రెండో స్థానంలో నిలిచిన త‌న‌కు టిక్కెట్ ఇవ్వాల‌ని పోదెం వీర‌య్య ప‌ట్టుబ‌డుతున్నాడు. మ‌రో వైపు భ‌ద్రాచ‌లం నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కు కొర‌త ఉంది.

2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌రుపున గెలిచిన కుంచా స‌త్య‌వ‌తి బీజేపీలో చేరారు. దీంతో ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌రుపున పోటీచేసే అభ్య‌ర్థి కోసం కాంగ్రెస్ వేట కొన‌సాగిస్తుంది. దీంతో, సీత‌క్క‌ను భ‌ద్రాచ‌లం నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేయాల‌ని సూచిస్తున్నార‌ట‌. దీంతో ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య సీటు స‌మ‌స్య రాద‌ని చెబుతున్నార‌ట కాంగ్రెస్ నేత‌లు. ఇప్ప‌టికే భ‌ద్రాచ‌లం నుంచి సీత‌క్క పేరును ఏఐసీసీ పంపిన లిస్టులో ఉంద‌ని, ఓ ప్ర‌చారం మొద‌లైంది. అయితే, ఇదంతా ఉత్త ప్ర‌చార‌మేన‌ని సీత‌క్క అనుచ‌రులు కొట్టి పారేస్తున్నారు. మొత్తానికి ములుగు సీటు ఎవ‌రికి వ‌స్తుంద‌నేది చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్‌గా కొన‌సాగే అవ‌కావం క‌నిపిస్తుంది.