//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మ‌హాకూట‌మి ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల‌కు ముహూర్తం ఖ‌రారు..!

Category : politics

తెలంగాణ‌లో Congress త‌రుపున పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాపై ఆ పార్టీ ఢిల్లీ అధిష్టానం ఇంకా స్ప‌ష్ట‌త‌కు రాలేదు. 74 మంది అభ్య‌ర్థుల‌కు కాంగ్రెస్ సెంట్ర‌ల్ ఎలెక్ష‌న్ క‌మిటీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినా ప్ర‌క‌టించ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. జ‌న‌గామ ఎమ్మెల్యే అభ్య‌ర్థి సీటును టీజేఎస్‌కు కేటాయించ‌నున్న‌ట్టు జ‌రుగుతున్న ప్ర‌చారంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పొన్నాల ల‌క్ష్మ‌య్య ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాకుండా, బీసీ నేత‌ల‌ను అవ‌మానించ‌డం, సీపీఐకి మూడు స్థానాల‌ను కేటాయించ‌డంప‌ట్ల ఆగ్ర‌హ జ్వాల‌లు రేకెత్తిన‌ట్టు తెలుస్తుంది. Mahakutami Candidates List Release Date Fixed

మ‌రో ప‌ది అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థుల జాబితా ఖ‌రారైనా, ఆ జాబితాపై తుదిరూపులు దిద్దేందుకు Congress అధిష్టానం చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేసింది. అయితే జాబితాను రేపు ప్ర‌క‌టించనున్న‌ట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండ‌గా, కోదండ‌రామ్ జ‌న‌గామ నుంచి పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారే స‌మాచారంతో పొన్నాల వ‌ర్గీయులు ప‌రేషాన్ అవుతున్నారు. టీజేఎస్‌కు ఎనిమిది సీట్లు ఇస్తున్నార‌ని, కోదండ‌రామ్ జ‌న‌గామ నుంచి పోటీకి రెడీ అవుతున్నార‌ని మ‌రోప‌క్క ప్ర‌చారం జ‌రుగుతుంది. మొత్తం మీద ఇప్పుడు జ‌న‌గామ సీటు పొన్నాల పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌పై హాట్‌టాపిక్‌గా మారింది.Mahakutami Candidates List Release Date Fixed

Congress లో ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితా ఇంకా కొలిక్కి రాక‌పోవ‌డానికి కార‌ణ‌మేంట‌న్న‌ది మ‌రికొన్ని రోజుల్లో వెల్ల‌డి కానుందని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రోప‌క్క గ‌ల్ఫ్‌తెలంగాణ సంఘాల‌ను క‌లిసేందుకు దుబాయ్ వెళ్లిన తెలంగాణ Congress నేత‌లు తిరిగి హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. న‌గరానికి చేరిన వారిలో కుంతియా, ఉత్త‌మ్‌, ష‌బ్బీర్ అలీ, జీవ‌న్ రెడ్డి ఉన్నారు.Mahakutami Candidates List Release Date Fixed